హైదరాబాద్ లో టీడీపీ బలమైన శక్తిగా ఉంది అనేది 2014లో గెలిచిన స్థానాలే చెబుతాయి. కానీ గ్రేటర్ ఎన్నికల తరువాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా కారు దూసుకెళిపోతోంది అక్కడ మూడేళ్ల తరువాత కూడా అదే పరిస్థితి ఉందా లేక ఏ మన్నా తెలుగుదేశం మెరుగుపడిందా అంటే కొంతమేర టీడీపీ, కాంగ్రెస్ కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడిన మాట వాస్తవమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలను పట్టకి నెట్టి జూబ్లిహిల్స్ స్థానం ఈ సారి కూటమి ఖాతాలోకి వస్తుందా లేదా అని సర్వత్రా ఉత్కంఠ కలిగిస్తుంది. సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సైకిల్ దిగి కారు ఎక్కడంతో క్యాడర్ ఆయనతో వెళ్లిందా లేక పార్టీతోనే ఉందా అనేది ఈ ఎన్నికతో తేలనుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మాగంటి గోపీనాథ్ 50,898 ఓట్లు సంపాదించగా, ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించారు. మైనార్టీలు తమతో ఉంటారనే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి కేవలం 33,642 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అధికారంలోకి వచ్చిన ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన మురళిగౌడ్ కేవలం 18,436 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రధాన పార్టీలు ఏవీ కూడా టీడీపీ దెబ్బకి రెండో స్థానంలో కూడా నిలవలేదు.
దాదాపు 25.4 శాతం ఓట్లు ఎంఐఎం అభ్యర్థి తరువాతి స్థానంలో నిలిచారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో ఆ నియోజకవర్గ పరిధిలో ఆరు డివిజన్ల వచ్చిన ఓట్లను పరిశీలిస్తే మొత్తం ఆరు డివిజన్లకు గాను 4చోట్ల కారు, రెండు స్థానాల్లో ఎంఐఎం పాగా వేశాయి. అసెంబ్లీ బరిలో టీఆర్‌ఎస్ 18 వేలకే పరిమితమవ్వగా అది గ్రేటర్ ఎన్నికలకొచ్చేసరికి 53364 ఓట్లు సాధించింది. అదే విధంగా ఎంఐఎం పార్టీ రెండు డివిజన్లలో తమ అభ్యర్థులను పెట్టకుండా టీఆర్‌ఎస్‌కు సహకరించినా మిగిలిన చోట్ల ఆ పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. దాంతో రెండు డివిజన్లను గెలుచుకుని రెండు చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మొత్తం మీద ఎంఐఎం పార్టీ 35634 ఓట్లను సాధించింది. కాని ప్రస్తుతం జట్టుకట్టిన కాంగ్రెస్, టీడీపీలకు కలిపి వచ్చిన ఓట్లు 40869 మాత్రమే. అయితే అప్పుడు కేసీఆర్‌ని నమ్మిన ఓటర్లు తరువాత హైదరాబాద్‌లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, సోషల్‌మీడియాలో ప్రజలు విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి వచ్చిన ఓట్లు 40 వేల చిల్లర ఉన్నా, మెజార్టీ ఓట్లు టీడీపీ పక్షానే ఉన్నాయి. అయినా ఆ సీటును టీడీపీకి కేటాయించకుండా కాంగ్రెస్‌కే ఇచ్చారు. ఇప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాంగంటి గోపీనాథ్‌కి ఎంఐఎం నుంచి కూడా పూర్తి మద్దతు ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ గెలవాలంటే కచ్చితంగా టీడీపీ ఓట్లు చాలా కీలకం.. అది గ్రహించిన పీజేఆర్ తనయుడు ఎన్టీయార్ భవన్‌కు వెళ్లి మరీ తానూ టీడీపీ మనిషినే అని ప్రజల్లో చెప్పుకునే ప్రతయ్నం చేశాడు. దీంతో ఆయన గెలుపు ఖాయమనే మాట వినిపిస్తోంది.