Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నంద్యాల ఉపఎన్నికల ఫలితం తరువాత వైసీపీ లో నిరాశానిస్పృహలు పెరిగితే టీడీపీ లో జోష్ ఎక్కువ అయ్యింది. ఆ పార్టీ నేతలు ఎక్కడ భేటీ అయినా నంద్యాల విజయం గురించి చెప్పుకుని ఖుషీ అవుతున్నారు. ఇటీవల మంత్రి గంటా పేషీలో మంత్రులు ఆదినారాయణ రెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూర్చున్నారు. వారి మధ్య నంద్యాల టాపిక్ వచ్చింది. ఆ ఎన్నికలో గెలిస్తే వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కి జగన్ 50 కోట్లు ఇస్తానని మాటిచ్చినట్టు చెప్పుకున్నారు. అయితే భారీ మెజారిటీ తెచ్చిన తమకు టీడీపీ అధినేత చంద్రబాబు 100 కోట్లు ఇవ్వాలని సరదాగా అనుకున్నారు.
ఆ సరదా మాటల్ని ఇంకాస్త పొడిగించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ వంద కోట్లని 16 మందికి పంచాలని అన్నారు. ఈ భాగహారం ఎందుకు అని అడిగినప్పుడు టీడీపీ తరపున అక్కడ మకాం వేసిన మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్య 16 అని మంత్రి చెప్పడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. అయితే ఈ 100 కోట్ల గురించి చంద్రబాబుని అడిగే వాళ్ళు ఎవరని ప్రశ్నిస్తే మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఏదో జోక్ గా చంద్రబాబుని నవ్వించడానికి పనికి వస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అనడంతో టాపిక్ ఇంకో టర్న్ తీసుకుంది. వైసీపీ లో పీకే ఓకే గానీ టీడీపీలో ఎవరున్నారు అని అడిగితే మాకు కూడా ఓ పీకే వున్నారని ఓ నేత అన్నారు. ఎవరా పీకే అని అడిగితే పయ్యావుల కేశవ్ అనడంతో ఇంకోసారి అక్కడ నవ్వులు చిందాయి.
మరిన్ని వార్తలు: