Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Tdp Wins In NandYala Cable Connection Bi-Elections
ఒక్క నంద్యాల ఉపఎన్నిక ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మించిపోతుంది. ప్రధాన పార్టీల ఎత్తులు, పైఎత్తులతో అసలు సిసలు సీమ రాజకీయం కనిపిస్తోంది. నంద్యాలలో గెలిపిస్తే కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తామన్న టీడీపీ హామీతో ప్రచారపర్వం వేడెక్కింది. దీంతో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి కూడా అలెర్టయ్యారు. తాను ఫ్రీగా ఇవ్వకపోయినా సబ్సిడీ రేటుకు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారట.
నంద్యాలలో టీడీపీ హామీకి, ఆ పార్టీ నేతల బిజినెస్ కు లింకుంది. నంద్యాల పట్టణంలో నంద్యాల కేబుల్ నెట్ వర్క్ అతి పెద్దది. ఇది భూమా సన్నిహితుడు ఎస్వీ సుబ్బారెడ్డిది. ఆయనకు ఫ్రీగా ఇవ్వడం పెద్ద కష్టం కాదు. అలాగే మరో కేబుల్ నెట్ వర్క్ నంది నెట్ వర్క్. ఇది నంద్యాల ఎంపీ ఎస్పీవైరెడ్డిది. ఆయనకూ ఫ్రీగా ఇవ్వడం ఈజీయే. కానీ శిల్పాకు వీరిద్దరిలా కేబుల్ నెట్ వర్క్ లేదు. ఎలా సబ్సిడీకి ఇస్తారన్నది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.
వైసీపీ అభ్యర్థి మిగతా డబ్బులిచ్చినా.. టీడీపీ నేతలు సహకరిస్తారా అనేది డౌటే. పైగా నంద్యాలలో గతంలో కూడా అరవై రూపాయలకే కేబుల్ కనెక్షన్ అని శిల్పా ప్రచారం చేసి ఓడిపోయారు. అప్పుడు నమ్మని జనం ఇప్పుడు నమ్ముతారా అనేది మరో అనుమానం. పైగా అధికారంలో ఉన్న టీడీపీతో పోటీపడి ఉచిత హామీలివ్వడానికి జగన్ పూర్తిగా విరుద్ధం. అలాంటిది శిల్పా హామీలపై ఆయన ఎలా స్పందిస్తారో ఆసక్తికరం.
మరిన్ని వార్తలు