తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ అని తేలిపోయింది. కౌశల్ ఆర్మీ చేసిన క్యాంపెయినింగ్ మరియు వారు వేసిన ఓట్లు కౌశల్‌ను విజేతగా నిలిపాయి. అయితే కొందరు మాత్రం కౌశల్ పెయిడ్ ఆర్మీ అంటూ, కౌశల్ ది నిజంగా గెలుపు కాదు అంటూ విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయినప్పటి నుండి కూడా కౌశల్ ఆర్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న తేజస్వి తాజాగా మరోసారి కౌశల్ పై విమర్శలు చేసింది. ఈ సీజన్ నిజమైన విజేత కౌశల్ కాదు అంటూ కౌశల్ ఆర్మీకి ఆగ్రహం తెప్పించింది.
బిగ్‌బాస్ సీజన్ 2 నిజమైన విజేతలు అమిత్, పూజా, భానుశ్రీ, రోల్ రైడా, గణేష్, శ్యామల, బాబు గోగినేని గారు. వీరు మాత్రమే నిజమైన విజేతలు, ఇతరులు ప్రేక్షకుల మరియు ఇంటి సభ్యుల అభిమానంను దక్కించుకోలేక పోయారు అంటూ తేజస్వి చెప్పుకొచ్చింది. దాంతో ఆగ్రహం వ్యక్తి చేసిన కౌశల్ ఆర్మీ సభ్యులు తేజస్విపై విమర్శలు గుప్పించారు. నీకు అసలు బుద్ది ఉందా, గెలిచిన వారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం ఏంటని, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేజస్వికి కౌశల్ ఆర్మీకి యుద్దం నడుస్తూనే ఉంది.