ప్రస్తుతం సౌత్ ఇండియా మూవీ దగ్గర మళయాళ మూవీ లు ఏ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. అయితే ఎప్పుడు నుంచో సాలిడ్ కంటెంట్ తో అదరగొడుతూ వస్తున్నా మళయాళ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ పరంగా కూడా పికప్ అవ్వడం స్టార్ట్ చేసింది. అలా ఉన్న కొన్ని సూపర్ హిట్ మూవీ ల్లో “నాయట్టు” కూడా ఒకటి.
వెర్సటైల్ నటుడు జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ని తెలుగులో తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ లు “కోటబొమ్మాళి పీఎస్” గా రీమేక్ చేసి తెలుగులో కూడా హిట్ అందుకున్నారు.
అయితే దీని ఒరిజినల్ వెర్షన్ నాయట్టు ఈరోజు నుంచి తెలుగులో “చుండూరు పోలీస్ స్టేషన్” గా అందుబాటులోకి వచ్చింది . మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో ఈ మూవీ రిలీజ్ కు వచ్చింది. మరి ఈ ఒరిజినల్ వెర్షన్ ను చూడాలి అనుకునేవారు ఆహాలో ఇప్పుడు ట్రై చేయవచ్చు.