Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల సినిమాల కలెక్షన్స్ తీరు మారిపోయింది. మొదటి వారం రోజుల్లోనే కలెక్షన్స్‌ను రాబట్టుకునేందుకు స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఒకే వారం రెండు మూడు పెద్ద సినిమాలను విడుదల చేసేందుకు సాహసం చేయడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా చాలా అరుదుగా, పండగ సీజన్లో మినహా ఒకే వారంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పెద్ద సినిమాు విడుదలైంది లేదు. కాని ఈ వారం మాత్రం మూడు పెద్ద సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాడు. ఈ మూడు సినిమాలు కూడా పెద్ద బడ్జెట్ సినిమాలు అవ్వడంతో పాటు, ఈ మూడు సినిమాలపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది.
ఆ మూడు సినిమాలు నితిన్ నటించిన ‘లై’, రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మరియు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’. ఈ మూడు సినిమాలు కూడా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాయి. తాజాగా ఈ విషయమై సురేష్‌బాబు మాట్లాడుతూ మూడు సినిమాలు ఒకే వారం అంటూ ఖచ్చితంగా మూడు సినిమాలపై ప్రభావం ఉంటుంది. ఎవరో ఒక్కరైనా తగ్గితే బాగుండేది అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. తమ సినిమా చాలా వారాలుగా వాయిదాలు వేస్తూ వచ్చాం అని, ఇక వాయిదాలు వేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేయాల్సి వస్తుందని అన్నాడు. మిగిలిన రెండు సినిమాల ప్రొడ్యూసర్స్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. మొత్తానికి ఈ మూడు సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. మరి ఏ సినిమా కాసుల వర్షం కురిపిస్తుందనేది చూడాలి.
మరిన్ని వార్తలు: