Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
TRS MP’s statement on NDA presidential candidate Ram Nath Kovind
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ లెక్కలపై టీఆర్ఎస్ ఎంపీ చెప్పిన మాటలు అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. కోవింద్ తరపున నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి సెట్ పై ప్రధాని, రెండో సెట్ పై చంద్రబాబు, మూడో సెట్ పై అమిత్ షా, నాలుగో సెట్ పై పంజాబ్ మాజీ సీఎం బాదల్ ఇప్పటికే సంతకాలు చేశారు. మళ్లీ జితేందర్ రెడ్డి సీన్ లోకి వచ్చి.. కొత్త లెక్క చెబుతున్నారు.
మొదటి సెట్ పై రాజ్ నాథ్, రెండో సెట్ పై టీఆర్ఎస్ సంతకాలు చేశాయంటున్నారు. నిజానికి నామినేషన్లో రెండు రకాల సంతకాలుంటాయి. అయితే ఆ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో జనంలో డౌట్స్ వస్తున్నాయనేది నిపుణుల మాట. ప్రతి నామినేషన్లో కోవింద్ పేరును ప్రతిపాదించేవారు, బలపరిచేవారి సంతకాల లిస్ట్ ఉంటుంది.
రాజ్ నాథ్, టీఆర్ఎస్ సంతకాలు ప్రతిపాదనవి అయ్యుంటాయని, పైన చెప్పిన నాలుగు సంతకాలు బలపరిచేవిగా భావిస్తున్నారు. జితేందర్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత గందరగోళం నెలకొనడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. కనీసం బీజేపీ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే కోవింద్ కు మద్దతు కూడగట్టే పనిలో ఉన్న కమలనాథులు.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్లు కనిపించడం లేదు.
మరిన్ని వార్తాలు: