Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శివాజీ వెల్లడించిన ఆపరేషన్ ద్రవిడపై రాజకీయ నేతలెవరూ నమ్మకం వ్యక్తంచేయడంలేదు. ఇది ఊహాజనిత కథనంగా కొట్టిపడేస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఇదేరకమైన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆపరేషన్ ద్రవిడ, గరుడ అంటూ శివాజీ చెప్పింది కట్టుకథ అని, ఎవరో చెప్పిన విషయాన్ని శివాజీ సినిమా స్టయిల్ లో చెప్పారని ఉండవల్లి విమర్శించారు. డబ్బు ఖర్చు చేసి రాజకీయపార్టీలు పొలిటికల్ ఆపరేషన్లు చేయిస్తాయనుకోనని, అలాంటివి సినిమాల్లోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
శివాజీ తన వీడియోలో పరోక్షంగా ఉండవల్లి గురించి కూడా ప్రస్తావించారు. కొత్త నాయకుడికి సహాయసహాకారాలు అందించేవారి జాబితాలో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఓ నాయకుడు ఉన్నట్టు శివాజీ వివరించారు. నిజనిర్ధారణ కమిటీ, జేఏసీ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కు ఉండవల్లి సహకరించిన నేపథ్యంలో శివాజీ చెప్పిన వ్యక్తి ఆయనేనని భావిస్తున్నారు. శివాజీ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందించి..ఆయన మాటలను కట్టుకథగా అభివర్ణించడం చూస్తుంటే…వీడియోలో ఉన్నవన్నీ నిజాలే అన్న భావన కలుగుతోంది.