Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతికి వచ్చిన మాజీ ఎంపీ అరుణ్ కుమార్ ని ఏపీ అసెంబ్లీ ఎలా ఉందని ఓ విలేకరి ప్రశ్నిస్తే ” బాగుందంటే టీడీపీ మనిషి అంటారు. బాగా లేదంటే వైసీపీ లో చేరాతానంటారు” అని జవాబు ఇచ్చి ఆ సస్పెన్స్ అలాగే కొనసాగించారు. కానీ ఉండవల్లి అమరావతి టూర్ ని పరిశీలిస్తే ఆయన నలిగిపోతోంది వైసీపీ, టీడీపీ మధ్య కాదని కాంగ్రెస్, వైసీపీ మధ్య అని తేలిగ్గా అర్ధం అవుతుంది. అదెలాగో చూద్దామా…
తాను ఎటు వైపు మొగ్గడం లేదని చెప్పడానికి సాక్ష్యంగా ఉండవల్లి నిన్న ఇంకో మాట వాడారు. తాను కాంగ్రెస్ నేతలు అయిన మల్లాది విష్ణు , కొలనుకొండ శివాజీ తో వచ్చానని కూడా ఉండవల్లి అన్నారు. అలా ఉండవల్లి పక్కన వచ్చిన ఆ ఇద్దరు భలే షాక్ ఇచ్చారు. తెల్లవారేసరికి మల్లాది విష్ణు వైసీపీ లో చేరిపోవడం ఖాయం అని తేలిపోయింది. ఆయన కాంగ్రెస్ కి రాజీనామా చేయడం, దాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆమోదించడం కూడా జరిగిపోయింది. ఇక ఈ సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తో కలిసి వైసీపీ లో చేయడానికి మల్లాది విష్ణు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇంకో ట్విస్ట్ ఏమిటంటే ఉండవల్లి పక్కన వచ్చిన కొలనుకొండ శివాజీ పీసీసీ అధికార ప్రతినిధి హోదాలో వైసీపీ అగ్రనేత భూమన కరుణాకర్ రెడ్డి ని చీల్చి చెండాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో nda అభ్యర్థి కోవిద్ కి వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని శివాజీ తూర్పారబట్టారు. ఇక వై.ఎస్ ఎన్నటికీ కాంగ్రెస్ నాయకుడే అని శివాజీ చెప్పారు. సోనియా ఆశీస్సుల తో వై.ఎస్ సీఎం అయ్యారని, భూమన లాంటి నేతల వల్ల ఆయనకి చెడ్డ పేరు వచ్చిందని శివాజీ ఆరోపించారు. ఇలా ఉండవల్లి పక్కన వచ్చిన నేతలు, వారి మాటలు, చేతలు చూస్తుంటే ఆయన కాంగ్రెస్, వైసీపీ మధ్య నలిగిపోతున్నాడని వేరే చెప్పాలా?
మరిన్ని వార్తలు