Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్టీ మారతాడంటూ పుకార్లు చెలరేగిన వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నేడు ( శుక్రవారం ) హైదరాబాద్ కోర్టుకు వచ్చిన అధినేత జగన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో విజయవాడ సెంట్రల్ సీట్ మీద తనకు హామీ ఇవ్వాలని రాధా గట్టిగా కోరినట్టు తెలుస్తోంది. పార్టీ అవసరాల కోసం మల్లాది విష్ణుని అక్కడ నుంచి పోటీ చేయించి, రాధకి అవనిగడ్డ లేదా విజయవాడ తూర్పు స్థానం కేటాయించాలని జగన్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో హర్ట్ అయిన రాధా టీడీపీలోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారని పుకార్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో జగన్, రాధా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సెంట్రల్ సీట్ విషయంలో జగన్ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసినా రాధా కూల్ అవ్వలేదని తెలుస్తోంది. ఆది నుంచి పార్టీని నమ్ముకున్న తనని కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని రాధా నేరుగా అధినేతని అడిగినట్టు సమాచారం. దానికి జవాబు ఇవ్వడంలో జగన్ ఇబ్బందిపడినట్టు కూడా సమాచారం వుంది.
రాధా అడిగినట్టు సెంట్రల్ మీద జగన్ స్పష్టమైన హామీ ఇవ్వకుండానే భేటీ ముగించినట్టు తెలుస్తోంది. దీంతో రాధా ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు వైసీపీ వర్గాలే అంటున్నాయి. అధినేత జగన్ కే షాక్ ఇచ్చిన రాధా పరిస్థితిలో మార్పు రాకుంటే ముందుగా ప్రచారం జరిగినట్టు టీడీపీ లో చేరేందుకు వెనుకాడరని కూడా విజయవాడ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.