Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవిత చరిత్రతో ఒక సినిమా తీయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశాడు. ఇటీవలే తాను ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేసినట్లుగా ప్రకటించాడు. త్వరలోనే సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ఇటీవలే ఒక మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలో పడ్డ బాధను తాను కళ్లార చూశాను. ఆ బాధను కళ్లకు కట్టినట్లుగా తన సినిమాలో చూపిస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. కాని ఇప్పుడేమో వర్మ మాట మార్చాడు. ఈ సినిమాను తాను తెరకెక్కించకుండా తన అసిస్టెంట్‌కు అప్పగిస్తున్నాడు. స్క్రిప్ట్‌లో సలహాలు ఇవ్వడంతో పాటు, దర్శకత్వంలో సలహాలు ఇచ్చిన తన శిష్యుడితో ఈ సినిమా చేయించాలని భావిస్తున్నాడు. వర్మ ఇతర ప్రాజెక్ట్‌లు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వర్మ ఇటీవల తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలు కూడా ఆయన శిష్యులు తెరకెక్కించినవే అనే టాక్ కూడా ఉంది. వర్మ మొదలు పెట్టి స్క్రిప్ట్ వివరిస్తే శిష్యులు సినిమాలు చేస్తూ వస్తున్నారని అందుకే ఇటీవల వర్మ చేసిన దాదాపు అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటున్నారు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను అధికారికంగా తనకు ఆప్తుడు అయిన ఒక శిష్యుడికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడే స్క్రిప్ట్ వర్క్‌ను చూసుకుంటున్నాడని, వర్మ సారధ్యంలో అతడు ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది. నటీనటుల ఎంపిక పూర్తి అయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.