Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఓ నెల కిందట పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు వినగానే వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. పెద్ద పెద్ద నాయకులు అనుకున్నవాళ్ళు కూడా జగన్ దగ్గర పీకే ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తాడో అన్న భయంతో వణికిపోయారు. పార్టీ కి పని చేయడం మాటెలా వున్నా పీకే దాన్ని గుర్తించడం ముఖ్యమని వైసీపీ నాయకులు డిసైడ్ అయిపోయారు. అయితే నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలతో మొత్తం సీన్ మారిపోయింది. పీకే వ్యూహాలు పనిచేయవని జగన్ దగ్గర చెప్పేందుకు వారికి ఒక సాకు దొరికింది. ఈ సాకుని వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ బాగా ఉపయోగించుకున్నారు.
నంద్యాల ఫలితాల మీద విశ్లేషణ సమయంలో వాసిరెడ్డి పద్మ పీకేని టార్గెట్ చేస్తూ సాక్షి ఛానల్ లో, కొమ్మినేని లైవ్ షో లో మాట్లాడారు. నంద్యాల ఫలితం ప్రశాంత్ కిషోర్ కి చెంప పెట్టు అనేసారు. దీంతో కొమ్మినేని కంగారుపడిపోయి అదేంటి అంత మాట అనేసారు అన్నప్పటికీ ఆమె కొంచెం కూడా వెనక్కి తగ్గలేదు. ప్రశాంత్ వ్యూహాలు మార్చుకోవాలని స్పష్టంగా చెప్పారు. ప్రజాబలం అంతగా లేని వాసిరెడ్డి పద్మ ఈ స్థాయిలో మాట్లాడితే ఇక కొద్దోగొప్పో ప్రజాదరణ వున్న వైసీపీ నాయకులు ఏ రేంజ్ లో ప్రశాంత్ ని టార్గెట్ చేస్తారో చూడాలి. కాకినాడ ఫలితం కూడా ప్రశాంత్ కి వ్యతిరేకంగా పార్టీ లో గొంతు ఎత్తుతున్నవారికి ఊపు ఇచ్చింది. మొత్తానికి వాసిరెడ్డి పద్మ సాక్షిలో పీకే కి వ్యతిరేకంగా కొమ్మినేని షో లో మాట్లాడడం ఆ పార్టీలో తిరుగుబాటు ధోరణికి ఓ సంకేతం మాత్రమే.
మరిన్ని వార్తలు: