20 ఏళ్ల బాలిక, 10 ఏళ్ల బాలుడి సీరియల్‌ హనీమూన్‌.. వివాదం

viewers-want-a-ban-on-pehredaar-piya-ki-more-than-50-k-sign

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

హిందీ సీరియల్‌ ‘పెహ్రేదార్‌ పియా కి’పై వివాదం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం సోనీ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌కు విపరీతమైన టీఆర్పీ రేటింగ్‌ వస్తుంది. కారణం ఈ సీరియల్‌లో విభిన్నంగా 20 ఏళ్ల అమ్మాయికి 10 సంవత్సరాల కుర్రాడితో వివాహం అవుతుంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆ అమ్మాయి తన కంటే సగం వయస్సు తక్కువ ఉన్న కుర్రాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత హనీమూన్‌ కూడా ఏర్పటు చేయడం జరిగింది. 10 సంవత్సరాల కుర్రాడితో హనీమూన్‌ ఏంటి అనేది ఇప్పుడు వివాదం. 

గత కొన్నాళ్లుగా ప్రసారం అవుతున్న ఈ సీరియల్‌పై మొదట్లో పెద్దగా విమర్శలు రాలేదు. వారిద్దరి పెళ్లి అయినప్పుడు కూడా పెద్దగా వివాదం కాలేదు. కాని 20 సంవత్సరాల అమ్మాయి 10 సంవత్సరాల అబ్బాయితో హనీమూన్‌కు వెళ్లబోతుంది అంటూ ఛానెల్‌ వారు సీరియల్‌ ప్రమోషన్‌ మొదలు పెట్టినప్పటి నుండి కూడా వివాదాలు మొదలయ్యాయి. ఈ సీరియల్‌ను బ్యాన్‌ చేయాలంటూ, నిలిపేయాలంటూ పలు రకాల ఫిర్యాదులు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానిని కొందరు కలిసి ఆ సీరియల్‌ను బ్యాన్‌ చేయాలంటూ విజ్ఞప్తిని అందజేయడం జరిగింది. ఆ లేఖలో అయిదు వేల మంది సంతకాలు ఉన్నాయి. వారంత కూడా సీరియల్‌ను బ్యాన్‌ చేయాలని విజ్ఞప్తి చేస్తూ సంతకం పెట్టడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ సీరియల్‌పై ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

మరిన్ని వార్తలు:

ముగ్గురిలో పై చేయి సాధించింది ఎవరు?

బిగ్‌బాస్‌ ఇంట్లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఎవరో తెలిసిపోయింది!