Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినిమా పరిశ్రమ బతికి ఉన్నన్నాళ్లు గుర్తుండి పోయే నటి సావిత్రి. ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. భారీ స్థాయిలో అంచనాలున్న ‘మహానటి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీద్ నిర్మిస్తున్నాడు. ఆయన అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో సమంత మరియు షాలిని పాండే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక సావిత్రి భర్తగా దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రంలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి సినిమా ‘ఎవడే సుబ్రమణ్యం’లో విజయ్ దేవరకొండ ముఖ్య పాత్రలో నటించాడు. ఆ సినిమా సమయంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్‌కు విజయ్‌కు మంచి స్నేహం ఏర్పడటం జరిగింది. ఆ స్నేహంతో ఇప్పుడు మహానటి చిత్రంలో చిన్న పాత్ర అయినా నటించేందుకు విజయ్ ముందుకు వచ్చాడు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహానటి చిత్రంలో విజయ్ ఏయన్నార్ పాత్రను పోషించబోతున్నాడు. ఎన్టీఆర్ మరియు ఏయన్నార్‌లతో సావిత్రి ఎన్నో చిత్రాలు నటించింది. ఈ ఇద్దరు దిగజ్జాలను చూపించకుండా మహానటి చిత్రం తీస్తే అది అసంపూర్తి అవుతుంది. అందుకే ఏయన్నార్ మరియు ఎన్టీఆర్ పాత్రలకు యువ హీరోలను ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న మహానటి చిత్రం వచ్చే సంవత్సరం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకే సారి తెరకెక్కిస్తున్నారు. ఒకే సమయంలో సినిమాను విడుదల చేయబోతున్నారు.