‘నోటా’ విజయ్‌కు ఒక గుణపాఠం…!

Vijay Devarakonda Nota Movie Is Different Experience

తెలుగులో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యి యూత్‌లో క్రేజీగా మారిపోయిన విజయ్‌ దేవరకొండ తాజాగా ‘నోటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్‌ గత చిత్రాలు ‘అర్జున్‌ రెడ్డి’, ‘గీతా గోవిందం’లు మంచి సక్సెస్‌ సాధించడంతో ఈ చిత్రం భారీగా అమ్ముడుపోయింది. కానీ ఆశించిన దగిన వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది. విజయ్‌ మీద ఉన్న నమ్మకంతో బయ్యర్‌లు భారీ మొత్తాన్ని వెచ్చించి ‘నోటా’ను కొనుగోలు చేశారు. కానీ ఈ ప్రభావం వారిపై భారీగానే పడిరది. రెండు మంచి హిట్‌లు అందగానే విజయ్‌ కథ విషయంలో ఏమాత్రం జాగ్రత్త వహించకుండా కేవలం రెండు యావరేజ్‌ చిత్రాలను చేసిన దర్శకుడికి అవకాశం ఇవ్వడం పెద్ద మైనస్‌.

nota

తెలుగు ప్రేక్షకులు ఇతర భాషల హీరోలని అభిమానిస్తారు, వాళ్ల సినిమాలు ఆధరిస్తారు కానీ కొన్ని భాషల వారు మాత్రం ప్రాంతీయాభిమాన్ని నరనరాల్లో జీర్ణించుకుపోతారు. వారి హీరోల చిత్రాలు తప్ప ఇతర భాషల్లోని ఎంత పెద్ద స్టార్లు నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను సైతం నిరాశపర్చుతారు. ఇలాంటి వారికి సరైన ఉదహరణ తమిళులు అని చెప్పవచ్చు. కోళీవుడ్‌లోకి వెళ్లి సక్సెస్‌ అయిన తెలుగు హీరోలు ఇటీవల లేనే లేరు అని గట్టిగా చెప్పవచ్చు. కోళీవుడ్‌లోకి వెళ్లడానికి చాలా మంది తెలుగు స్టార్‌ హీరోలు ప్రయత్నించి చేదు అనుభవాలనే పొందారు.

vijaydevarakonda

పట్టుమని పది సినిమాలు చేయకుండానే విజయ్‌ దేవరకొండ తమిళుల చెంతకు వెళ్లడం చాలా పెద్ద మైనస్‌ అని టాలీవుడ్‌ వర్గాల వారంటున్నారు. తమిళ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రెండిటికి చెడిన రేవడిలా తయారయింది. తెలుగులో కూడా ఈ చిత్రం ఆడలేకపోయింది. బాగా స్పీడు మీదున్న విజయ్‌కు ఈ ‘నోటా’ ఒక గుణపాఠం అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

nota-pics-new