Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పార్లమెంట్ వేదికగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు వైఫల్యాల మీద ఇన్నాళ్లకు కేంద్రాన్ని నిలదీస్తోంది అధికార టీడీపీ. నిన్నమొన్నటిదాకా కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ముందా అని టీడీపీ ని రెచ్చగొట్టిన వైసీపీ తాజా పరిణామంతో సంతోషపడాల్సింది. కానీ ఆలా చేయకపోగా విభజన సమస్యల విషయంలో కేంద్ర మంత్రిగా ఉండి కూడా క్రీంద్రాన్ని తప్పుబడుతున్న సుజనా చౌదరి మీద వైసీపీ మండిపడింది. రాజ్యసభలో ఇదే విషయం మీద సుజనా చౌదరి మాట్లాడుతుంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడ్డం పడినంత పనిచేశారు. కేంద్ర ప్రభుత్వంలో కొనసాగుతూ కేంద్రాన్ని తప్పుబట్టడం ఏంటని ప్రశ్నిస్తూ ఆయనకు అడ్డు తగిలారు. సుజనా ప్రసంగానికి అనుమతి ఇచ్చిన రాజ్యసభ ఛైర్మన్ మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి సంబంధించిన సమస్య మీద ఓ కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో గళం ఎత్తుతుంటే సంతోషించకుండా ఆయనకు మాట్లాడే హక్కు లేదని విజయసాయి చేసిన వితండవాదం వైసీపీ కి ఆత్మహత్యసదృశ్యం కానుంది. ఈ పరిణామాన్ని అందిపుచ్చుకుని బీజేపీ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని వైసీపీ మీద టీడీపీ దాడి ఉధృతం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా సాంకేతిక అంశాల్ని పట్టుకుని వేలబడుతూ సుజనా చౌదరి రాజీనామా కోసమే పట్టుబడుతూ విజయసాయి ఇంకాస్త చులకన అవుతున్నారు. మంత్రి వర్గంలో కొనసాగుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు క్యాబినెట్ లో కొనసాగడానికి వీల్లేదని కోరుతూ రాష్ట్రపతిని కలిసేందుకు విజయసాయి ట్రై చేస్తున్నారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు మమ్మల్ని ఓడించడానికి ఎవరో అవసరం లేదు ఒక్క విజయసాయి చాలు అని కామెంట్ చేశారట.