Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ కి ఒకప్పుడు వ్యాపార సలహాల్లో, ఇప్పుడు రాజకీయ ప్రయాణంలో కూడా కుడి భుజంలా వ్యవహరిస్తున్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. 2014 ఎన్నికల్లో పార్టీ కి అపజయం ఎదురు అయ్యాక వైసీపీ కి అధికారం కోసం జరిగే పోరాటంలో విజయసాయి ముందుకు వచ్చారు. ఓ చార్టెడ్ అకౌంటెంట్ కి రాజకీయాలు ఏమి తెలుస్తాయి అనుకున్నారు చాలా మంది. అయితే ఆ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ విజయసాయి చాలా చేశారు. బీజేపీ అధిష్టానంతో సత్సంబంధాలు సృష్టించగలిగారు.
ప్రధాని మోడీతో జగన్ కి అపాయింట్ మెంట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ని పక్కనబెట్టి వైసీపీ తో కలిసి వెళితే ఎలా ఉంటుందని బీజేపీ లో ఆలోచన పుట్టించారు . దాన్ని సాకుగా చూపి చంద్రబాబుని భయపెట్టగలిగారు. కొత్త రాష్ట్రపతి ఎవరో అని దేశమంతా తల బద్దలు కొట్టుకుంటుంటే విజయసాయి నేరుగా పాట్నా వెళ్లి అప్పట్లో బీహార్ గవర్నర్ గా వున్న కోవిద్ ని కలవగలిగారు. ఈ పరిణామాలు వెంటవెంటనే చూసిన వారికి అప్పటిదాకా వైసీపీ ఆవేశం తప్ప వ్యూహాలు చూడని చాలా మందికి అబ్బో అనిపించింది. లాబీయింగ్ లో వైసీపీ కి విజయసాయి లాంటి మాస్టర్ మైండ్ దొరికినట్టు కనిపించింది. విజయసాయి కి కూడా తన మీద తనకు నమ్మకం పెరిగింది.
కానీ ఒకే ఒక్క ఎపిసోడ్ తో మొత్తం సీన్ తిరగబడింది. ఆ ఎపిసోడ్ నంద్యాల ఎన్నికల రిజల్ట్. ఆ ఒక్క విషయంతో బీజేపీ తో కోటగోడలా కట్టుకుంటూ వచ్చిన సంబంధాలు ఇసుక గూడులా కూలిపోయింది. అంతే కాదు కొత్త మిత్రపక్షం అవసరం లేదని వైసీపీ ముందే బీజేపీ తలుపులు మూసేసింది. ఇక విజయసాయి వ్యూహంలో భాగంగా బీజేపీ తో అంటకాగడానికి రెడీ అయిన వైసీపీ కి ముస్లిం మైనారిటీ లు దూరమయ్యారు. ఇక తిరుగులేని అస్త్రం లాంటి ప్రత్యేక హోదా అంశం వైసీపీ కి పనికి రాకుండా పోయింది. ఇన్ని రకాలుగా జరిగిన నష్టాన్ని చూసి విజయసాయికి ఇప్పుడు రాజకీయం లోతు తెలిసి వచ్చిందట.
మరిన్ని వార్తలు: