Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విజయవాడ కేంద్రంగా ప్రైవేట్ ట్రావెల్స్ వివాదం మరో మలుపు తిరిగింది. ట్రావెల్స్ బిజినెస్ నుంచి తప్పుకున్న ఎంపీ కేశినేని నాని తమ వ్యాపారాల మీద కక్ష సాధిస్తున్నట్టు ఆరంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దాంతో పాటు నాని 10 కోట్ల సర్వీస్ టాక్స్ బకాయి వున్నాడని కూడా సునీల్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ ఆరోపణల వెనుక కారణం వేరే వుంది.
ఈ ఏడాది మార్చి నెలలో ఆరంజ్ ట్రావెల్స్ బస్సు ఒకటి ఓ యాక్సిడెంట్ లో ఇరుక్కుంది. ఆ బస్సుని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దానిని బయటికి రాకుండా నాని ఒత్తిడి చేస్తున్నాడని భావించిన ఆరంజ్ ట్రావెల్స్ యాజమాన్యం కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ నాని ఒత్తిడి వల్లే పోలీసులు తమ బస్సు బయటికి ఇవ్వడం లేదని సునీల్ కుమార్ రెడ్డి అంటున్నారు. నానిని అడ్డుకోకుంటే తమ సిబ్బంది కూడా కేశినేని ట్రావెల్స్ ఉద్యోగులు లాగానే జీతాల కోసం వీధిన పడాల్సి వస్తుందని, ఆ పరిస్థితి రాకుండా చూడాలని ఆయన సీఎం చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.
మరిన్ని వార్తలు:
వచ్చే ఏడాది సీఎంగా రజినీకాంత్!
టమోటాలు, ఉల్లిపాయలు రాఖీ గిఫ్ట్ గా ఇచ్చిన నేత.
పవన్ కి రోజా డోలు…జయప్రకాశ్ సన్నాయి.