తెలుగు, తమిళ్ హింది సినిమా పరిశ్రమ దర్శకులనుండి ఇప్పుడు ఒక్కటే మాట వినపడుతుంది అదే బయోపిక్. దర్శకులుకూడా బయోపిక్ మూవీ తియ్యడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తెలుగులో సావిత్రి జీవితం ఆధారంగా రూపొందిన మహానటి. సినిమా, రాజకీయ వ్యవస్థను ఏలిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్రను ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో రూపొందించాడు క్రిష్, అలాగే రాజశేకర్ రెడ్డి గారి జీవిత చరిత్రను యాత్ర పేరుతో రూపొందించారు. ఇప్పుడు ఈ బయోపిక్ ట్రెండ్ బాలీవుడ్ లోను కొనసాగుతుంది. నవజుద్దిన్ సిద్దిక్ ముఖ్య పాత్రలో థాక్రే జీవితని, అబిజిత్ పాన్సి రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంనుండి విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్సు కూడా వచ్చింది.
తాజాగా మరో బయోపిక్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోది జీవితాని తెర రుపంలో చూపించేందుకు బాలీవుడ్ డైరక్టర్ ఒమంగ్ కుమార్ సిద్దంగా ఉన్నాడు అందుకు సంబందించిన పనులు కూడా మొదలు పెట్టేశాడు. “పియం నరేంద్రమోది” అనే టైటిల్ తో వస్తున్నాడు. ఆ చిత్రంలో నరేంద్ర మోది పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 7వ తేదిన విడుదల చేస్తాడు. ఆ బయోపిక్ లో ఒక్క చాయి అమ్ముకునే వ్యక్తి గుజరాత్ ముఖ్యమంత్రి ఏలా అయ్యాడు అక్కడినుండి దేశ ప్రధాని ఏలా అయ్యాడు. అతను పడ్డ శ్రమ, కృషి పట్టుదల అతనిని ఏలా ఉన్నత స్థాన్నంలో నిలబెట్టింది అనే అంశాల చుట్టూ నరేంద్ర మోది బయోపిక్ నడుస్తుందని బాలీవుడ్ సినీ వర్గాలనుండి అందుతున్న సమాచారం.