యాక్షన్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్‌తో సినిమా చేసేందుకు ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఆసక్తి చూపడం లేదు. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నెం.150’కి దర్శకత్వం వహించిన వినాయక్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ‘ఇంటిలిజెంట్’ చిత్రాన్ని తెరకెక్కించాడు. పరమ చెత్త టాక్ దక్కించుకున్న ఇంటిలిజెంట్ చిత్రం తేజూ కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రాల్లో ఒక్కటిగా నిలిచింది. ఇంటిలిజెంట్ దెబ్బకు వినాయక్‌తో సినిమా చేసేందుకు హీరోలు భయపడుతున్నారు. మొన్నటి వరకు బాలకృష్ణ ఈయన దర్శకత్వంలో చిత్రంను చేసేందుకు ఆసక్తి చూపించాడు. ముందుగా అనుకున్న ప్రకారం ‘ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభంకు ముందే వినాయక్ దర్శకత్వంలో బాలయ్య మూవీ తెరకెక్కాల్సి ఉంది. కాని బాలయ్య వెనక్కు తగ్గాడు.
ప్రస్తుతం ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని చేస్తున్న బాలకృష్ణ అక్టోబర్‌లో బోయపాటి చిత్రాన్ని మొదలు పెట్టబోతున్నాడు. 2019 జనవరి లేదా ఫిబ్రవరిలో బోయపాటి, బాలకృష్ణల మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నారు. అదే సంవత్సరం దసరాకు ఆ చిత్రం రాబోతుంది. ఆ తర్వాత కూడా బాలయ్య తన తదుపరి చిత్రం చేసే ఛాన్స్‌ను వినాయక్‌కు ఇవ్వడం లేదు. ఇన్నాళ్లు బాలకృష్ణపై నమ్మకం పెట్టుకుని ఉన్న వినాయక్ ఇప్పుడు మరో హీరో కోసం వెదుకుతున్నాడు. స్టార్ హీరోలు ఏ ఒక్కరు కూడా వినాయక్‌కు కనీసం డేట్లు కూడా ఇవ్వడం లేదు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో చిన్న హీరోతో బాలకృష్ణ మూవీ చేయాలని నిర్ణయించుకున్నాడు. మెగా హీరోల్లో ఒకరితో ఈయన చిత్రం చేయాలని భావించినా అది సాధ్యం కావడం లేదు. కెరీర్ ఆరంభంలో ఒకటి రెండు చిత్రాలతో సక్సెస్‌ను దక్కించుకుని, గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఒక క్రేజ్ లేని హీరోతో వినాయక్ మూవీని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. మరీ చిన్న హీరోతో వినాయక్ చిత్రాన్ని మొదలు పెట్టబోతున్న నేపథ్యంలో సినీ వర్గాల వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వినాయక్ మరీ ఇంతగా దిగజారడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.