సోమిరెడ్డి డేర్ చేసాడు… ఇక వర్మ ఏమి చేస్తాడో ?

war between varma and ap minister somireddy about lakshmi's Ntr

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఏ పరిస్థితుల్లో అయినా సీఎం చంద్రబాబు మీదకి మాట రాకుండా అడ్డు పడే సైన్యం ఒకటి ఏర్పాటు చేస్తే దానికి సేనాధిపతిగా కచ్చితంగా సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వుంటారు. టీడీపీ లో మహామహా నేతలే వై.ఎస్ హయాంలో ఆచితూచి మాట్లాడితే సోమిరెడ్డి గొంతు మాత్రం బాబుకి అండగా బలంగా వినపడింది. పదవి వున్నా లేకున్నా పార్టీ కి కీడు చేసే ఏ పరిణామంలో అయినా ఎదుర్కోడానికి సిద్ధంగా వుండే సోమిరెడ్డి ఇప్పుడు “లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విషయంలోనూ గొంతెత్తాడు. ఆ సినిమా లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉంటుందని అందరికీ తెలుసు. బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం ఇవ్వలేదని పోటీగా వర్మ ఈ సినిమా తీస్తున్నాడని కూడా తెలుసు. వైసీపీ నేత ఈ సినిమాకి నిర్మాత అని తెలుసు. అన్ని తెలిసినా ఏమి మాట్లాడితే వర్మ ఇంకెంత రచ్చ చేస్తాడో అన్న భయం చాలా మంది టీడీపీ నేతలకు వుంది. దాని వల్ల వర్మ ఏ పాత విషయాలు కొత్తగా ముందుకు తెస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని వారి ఆందోళన.

వర్మ నోటికి, ట్విట్టర్ అకౌంట్ కామెంట్స్ కి అందరూ భయపడుతుంటే సోమిరెడ్డి మాత్రం ఏ జంకుగొంకు లేకుండా గొంతెత్తాడు. ఈ సినిమా వెనుక జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని బయటికి చెప్పాలని వర్మకి సూచించాడు. అంతే కాదు…లక్ష్మీపార్వతి పాత్రలో ఇంకెవరో ఎందుకు స్వయంగా ఆమెనే హీరోయిన్ గా పెట్టుకోవచ్చు కదా అని గడుసైన సలహా కూడా ఇచ్చేసాడు. అసలే వర్మ ఎదుటివాళ్ళు మౌనం గా ఉంటేనే రెచ్చిపోతాడు. ఇక ఇప్పుడు సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడో, ఎలా రచ్చ చేస్తాడో ?

ఈ విషయంలో సోమిరెడ్డి సంయమనం పాటించి ఉంటే బాగుండేదని కొందరు అంటున్నా టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన డేరింగ్ నెస్ చూసి ముచ్చటపడుతున్నాయి. వర్మ నోటికి ఎంత కాలం భయపడాలని ప్రశ్నిస్తున్నాయి. ఇటీవల నంద్యాల ఎన్నికల సమయంలో కూడా పోరు హోరాహోరీ తొక్క తోలు అంటూ జగన్ అనుకూల సోషల్ మీడియా నానా రచ్చ చేసింది. అప్పుడు వైసీపీ నిజంగా గెలుస్తుందేమో అని కొందరు టీడీపీ నేతలు సందేహపడ్డారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలు బాబు పాలనకు రెఫరెండం అని ఒప్పుకుంటారా అని సవాల్ విసిరితే ఎవరూ ముందుకు రాలేదు ఒక్క సోమిరెడ్డి తప్ప. ఆయన నంద్యాల ఫలితం రెఫరెండం అని ప్రకటించడమే కాకుండా 25 వేలకి పైగా మెజారిటీ వస్తుందని డంకా బజాయించి మరీ చెప్పారు. అన్న మాటకి తగ్గట్టే నిలబెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా సోమిరెడ్డి వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులకు కొత్త ఊపు ఇస్తాయనడంలో నో డౌట్. లెట్ అజ్ వెయిట్ ఫర్ వర్మాస్ రియాక్షన్.