Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
టీవీ 9 చర్చలో వైసీపీ ఎమ్మెల్యే రోజా , బండ్ల గణేష్ మధ్య వివాదం ఏ స్థాయికి వెళ్లిందో చూసాం. సంచలనాల కోసం పాకులాడే టీవీ 9 లాంటి ఛానల్ సైతం వీరి భాష భరించలేక ఆ చర్చను ఆపేస్తున్నట్టు ప్రకటించింది. కానీ అదే ఎపిసోడ్ రీ టెలికాస్ట్ చేసింది. యు ట్యూబ్ లో పెట్టింది వేరే విషయం అనుకోండి. మొత్తానికి టీవీ 9 కూడా సిగ్గుపడేంత భాష ఆ చర్చలో రావడానికి రోజా, గణేష్ ఇద్దరూ బాధ్యులే. ఇద్దరూ అదుపు తప్పారు. రోజా ముందుగా నోరు పారేసుకుంది అనుకున్నా ఆమెను అంతగా రెచ్చగొట్టింది గణేష్ అన్నది ఆ డిస్కషన్ చూసిన ఎవరికి అయినా తేలిగ్గా అర్ధం అవుతుంది. ఎంత దూకుడుగా మాట్లాడినా రోజా అంటే ఓ పార్టీ ఎమ్మెల్యే. ఎంతోకొంత ప్రజా జీవితంతో సంబంధం వున్న వ్యక్తి. కానీ గణేష్ విషయానికి వచ్చేసరికి ఆ రూట్ సెపరేట్.
బండ్ల గణేష్ మీద సినీ రంగంలోనే ఎన్నో వివాదాలు వున్నాయి. ఆయన పవన్ అభిమాని కావొచ్చు గానీ ఆయన వ్యక్తిత్వం మీద ఎవరికీ సదభిప్రాయం లేదు. ఇలాగే ప్రజారాజ్యం టైం లో రాజశేఖర్ కుటుంబం మీద మెగా స్టార్ ఫాన్స్ దాడి చేయడం ఎంత రచ్చకు దారి తీసింది అందరికీ తెలిసిందే. ఇక 2014 ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా వైసీపీ అధికార ప్రతినిధులుగా వున్న అంబటి రాంబాబు వంటి నేతల మాటలు ఆ పార్టీకి మేలు చేయకపోగా ఎంతోకొంత నష్టం చేశాయి. ఎవరో ఒకరు మన భజన చేస్తున్నారు కదాని ఉరుకుంటే , ఆ భజన చేసేవాళ్లు వ్యక్తిత్వం మీద సదభిప్రాయం లేకుంటే జరిగే నష్టం చాలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే రాజకీయ అడుగులు మొదలెట్టిన జనసేన ఇలాంటి చిన్నచిన్న విషయాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి ఉంటుంది.