Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీలో బీజేపీ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు కీలక నేతలు పార్టీని వీడి అధికార ప్రతిపక్షాల బాట పడుతున్నారు. ఇటీవలే 2014 తిరుపతి బీజేపీ అభ్యర్థి జయరాం టీడీపీలో చేరగా, మరోనేత కాటసాని వైసీపీలో చేరారు. ఇక గుంటూరు జిల్లాకి చెందినా కాపు వర్గ కీలక నేత కన్నా కూడా సైకిల్ ఎక్కేందుకు సిద్దం అయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈరోజు సాయంత్రం పార్టీ కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లనున్న కృష్ణంరాజు.. ఆయన సమక్షంలో టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన ద్రోహాన్ని సహించలేక…పార్టీని వీడుతున్నానని ప్రకటించారు.
రఘురామ కృష్ణంరాజు మాజీ వైసీపీ నేత ఆయన స్వయానా వైఎస్ కి ఆత్మ అని పిలుచుకునే కేవీపీకి స్వయానా వియ్యంకుడు ఈయన కూడా వైఎస్ బతికున్న రోజుల్లో వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్ వేరు కుంపటి పెట్టాక మొదట్లో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే వైఎస్సార్సీపీలో చేరానని చెప్పిన రఘురామకృష్ణంరాజు తర్వాత తర్వాత వైఎస్సార్సీపీ విభజన కోరుకుంటోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. అయితే ఆయన జగన్ వ్యవహారశైలి నచ్చకే బయటకు వచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. దానికి ఆయన జగన్ మీద చేసిన ఆరోపణలు మరింత ఊతం ఇచ్చాయి. ఆయన జగన్ గురించి చాలా ఆరోపణలు చేశారు. జగన్‌లో మరో అపరిచితుడు ఉన్నాడని… ఆయన బయట పెట్టాడు.
పార్టీలో పెద్దవాళ్ళకి, సీనియర్లకి ఆయన తగిన గౌరవం ఈయకపోయినా అందరూ ఆయనని గౌరవంగా ‘సర్’ అని మాత్రమే సంభోదించాలి. లేకుంటే ఆయనకు చాలా కోపం వస్తుంది. చివరకి ఎవరయినా ఆయన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని పొగిడినా ఆయన తట్టుకోలేడు. ఆయన అహంభావం తట్టుకోవడం చాల కష్టం. ఆయనకీ తగిన బుద్ధి చెప్పెందుకే నేను రాజకీయాలలో కొనసాగాలనుకొంటున్నానని ప్రకటించిన ఆయన అప్పుడే టీడీపీలో చేరుదామనుకున్నా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితులు కనిపిస్తూండటంతో తాను కోరుకున్న నర్సాపురం సీటు బీజేపీ వెళ్తుందని …అంచనా వేసుకుని వెంకయ్య నాయుడిని కలిసి బెజీపే తీర్ధం పుచ్చుకున్నారు.
కానీ నర్సాపురం సీటు బీజేపీకి వెళ్లినా ఆరెస్సెస్ పెద్దల సహకారంతో చివరి నిమిషంలో ఆ సీటు మరో పారిశ్రమిక వేత్త గోకరాజు గంగరాజు టిక్కెట్ తెచ్చుకున్నారు. దాంతో ఎన్నికల్లో పోటీ చేయాలన్న రఘురామకృష్ణంరాజుకు నిరాశ ఎదురయింది. అప్పట్నుంచి ఆయన బీజేపీతో అంటీముట్టనట్లుగానే ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల వేడి పెరుగుతూండటం… అన్ని పార్టీలు బీజేపీనే టార్గెట్ చేస్తుండడం ఇక బీజేపీతో నడిస్తే అసలు రాజకీయ భవిష్యత్తే లేదని భావించిన ఆయన తెలుగుదేశం చెంతకు చేరుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక హోదాపై బీజేపీ చేసిన ద్రోహాన్ని సహించలేక…పార్టీని వీడుతున్నానని ఆయన ప్రకటించారు.ఆయన రాకతో.. ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ మరింత బలపడే అవకాశం ఉంది. నేడు భారీ ర్యాలీతో విజయవాడకు వచ్చే ఆయన చంద్రబాబును కలిసి పచ్చ కండువాను కప్పుకోనున్నారు.