మహేష్‌, త్రివిక్రమ్‌ల మద్య ఏం జరిగింది…?

What Happened Between Mahesh And Trivikram

టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఈమద్య చాలా క్లోజ్‌గా ఉంటున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈమగ్గురు ఈమద్య పదే పదే కలుస్తూ వస్తున్నారు, ఒకరి సినిమాల వేడుకలో ఒకరు పాల్గొనడంతో పాటు, ఒకరి సినిమాల గురించి ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలైంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న అరవింద సమేత చిత్రంపై ఇప్పటికే రామ్‌ చరణ్‌ స్పందించి, శుభాకాంక్షలు తెలియజేశాడు. కాని ఇప్పటి వరకు మహేష్‌ బాబు మాత్రం స్పందించలేదు.

ntr-maheshbabu

‘అరవింద సమేత’ చిత్రంపై మహేష్‌బాబు స్పందించకపోవడంతో నందమూరి ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పుకునే మహేష్‌బాబు ఎందుకు ఈసారి సినిమా గురించి ట్వీట్‌ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్‌ స్పందించకపోవడానికి కారణం ఆయనకు త్రివిక్రమ్‌కు మద్య ఉన్న విభేదాలు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత కొన్నాళ్లుగా మహేష్‌బాబుకు త్రివిక్రమ్‌కు మద్య మంచి సంబంధాలు లేవని, ఆ కారణంగానే మహేష్‌ ఈచిత్రం గురించి స్పందించలేదంటున్నారు. అయితే అలాంటిదేమీ లేదని, కేవలం మహేష్‌బాబు బిజీగా ఉన్న కారణంగానే అరవింద సమేత చిత్రాన్ని చూడలేదు, స్పందించలేదని కొందరు మహేష్‌ సన్నిహితులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Aravindha Sametha Movie Hangama In Nizam