Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఎందులో అయినా అధికార పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ప్రతిపక్ష పార్టీ కూడా సత్తా చాటాలి. లేదంటే సాధారణ ఎన్నికలకు కష్టమైపోతోంది. పైగా ఉపఎన్నికల్లో గెలిచి తీరతామని తొడగొట్టి చెప్పిన వైసీపీ.. ఇప్పుడు లేనిపోని సాకులు చెప్పి ప్రజల దృష్టిలో మరింత పలుచనైపోయింది. అలాంటి జగన్ ఇప్పుడు మాత్రం అంర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కాకినాడ ఓటమి గురించి జగన్ పెద్దగా బాథపడటం లేదు. కానీ నంద్యాలే ఆయనకు అంతుబట్టడం లేదు. రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేని విధంగా నంద్యాలలో ప్రతి ఇల్లూ తిరిగారు జగన్. పైగా పదమూడు రోజుల పాటు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంత చేస్తే జనం తననెందుకు పట్టించుకోలేదని జగన్ తనను తానే ప్రశ్నించుకుంటున్నారు. అందుకే కొద్దిరోజులుగా సైలంట్ గా ఉన్నారు జగన్.
కనీసం ఉపఎన్నికల ముందు సవాళ్లు విసరకుండా, రిఫరెండం అనకుండా ఉంటే బాగుండేదని వైసీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక శిల్పా మోహన్ రెడ్డి పరిస్థితి దారుణంగా ఉంది. సరే అయిందేదో అయిపోయింది.. ఇప్పుడు వైసీపీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. కనీసం అక్టోబర్ నుంచి పాదయాత్ర అయినా సరిగ్గా జరుగుతుందనే నమ్మకం పార్టీ శ్రేణులకు లేదు. మరి చూడాలని జగన్ ఎలాంటి ఎత్తులు వేస్తారో.
మరిన్ని వార్తలు: