Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఒకప్పుడు ఏ వంగవీటి వారసుడు ఉంటే కాపులు తన పార్టీకే అండగా ఉంటారని వైసీపీ అధినేత జగన్ భావించారో ఇప్పుడు అదే నాయకుడిని పార్టీ నుంచి పంపించడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇదేదో పార్టీ అంతర్గత కుమ్ములాట ఫలితం అనుకుంటే పొరపాటే. అంతకు మించిన రాజకీయం ఇందులో దాగి వుంది. వంగవీటిని పార్టీ నుంచి బయటకు పంపడం ద్వారా పాలిటిక్స్ లో ఇలా కూడా చేయొచ్చా అనే రేంజ్ లో ఓ ప్లాన్ వేసారట. ఆ ప్లాన్ గురించి తెలుసుకుని ఇప్పటికే వంగవీటి రాధా షాక్ నుంచి తేరుకోలేదట. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటంటే…
2014 ఎన్నికల్లో గెలుపు ఖాయం అని కలలుగన్న వైసీపీ అధినేత జగన్ కి ఫలితాలు పెద్ద షాక్. ఓటమి తర్వాత పోస్ట్ మార్టం లో పవన్ కళ్యాణ్ పిలుపుతో కాపుల ఓట్లు రాకపోవడం కీలక భూమిక వహించిందని తేలింది. దీంతో కాపులని ఆకట్టుకోడానికి గట్టి ప్రయత్నం చేయాలని జగన్ భావించారు. అందుకే కాపు రిజర్వేషన్ ఉద్యమానికి దన్నుగా నిలిచారు. కానీ జగన్ అంచనాలకు భిన్నంగా కాపులకి రిజర్వేషన్ ఇస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకోసారి బయటకు వచ్చి తాను వైసీపీ కి వ్యతిరేకం అని చెప్పకనే చెప్పారు. ఈ పరిణామాలతో ఇక కాపు ఓట్లు రాబట్టడం కష్టం అని భావించిన జగన్ ఇక వారికి వ్యతిరేకంగా బీసీ లను దువ్వే పనిలో పడ్డారు. ఇందుకోసం ఆయన ఓ నెగటివ్ ఫార్ములా ఎంచుకున్నట్టు వుంది.
ఆంధ్రప్రదేశ్ లో కాపులు సొంతం చేసుకునే వంగవీటి కుటుంబాన్ని పార్టీకి దూరం చేస్తే బీసీ లు వైసీపీ కి దగ్గర అవుతారని లెక్కలు వేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే రంగా వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రాధాని క్రమక్రమంగా పార్టీ నుంచి దూరం చేస్తున్నట్టు అనిపిస్తోంది. పార్టీ పదవులు మొదలుకుని ప్రాధాన్యం దాకా విజయవాడ వైసీపీ లో రాధా కి ఏవి నచ్చవో అవే చేస్తున్నారు. ఆయనకి ఎవరంటే పడదో వాళ్లనే ప్రోత్సహిస్తున్నారు. ఇదేదో మొదట్లో అనుకోకుండా జరిగినట్టు అనిపించినా వైసీపీ నుంచి బహిష్కరణకు గురి అయిన గౌతమ్ రెడ్డి మాటకి వున్న విలువ కూడా రాధా కి ఇవ్వకపోవడంతో అసలు విషయం తెలుస్తోంది. రాధా స్వయంగా వైసీపీ నుంచి బయటకు వెళ్లి ఆ పార్టీ మీద విమర్శలు చేస్తే దాన్ని అడ్డం పెట్టుకుని కాపులకి వ్యతిరేకం, బీసీ లకు అనుకూలం అనే బ్రాండ్ తెచ్చుకోవచ్చని జగన్ ప్లాన్ అట. ఇక రాధా టీడీపీ లో చేరితే ఆ ప్రచారం ఇంకా ఉధృతం చేయాలని అనుకుంటున్నట్టుంది జగన్. ఈ వ్యూహాలు చూస్తుంటే జగన్ రాజకీయంలో రాధా పావుగా మారినట్టు అనిపించడం లేదూ!