Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్ ముందర కాళ్ళకి బంధాలు పడ్డాయి. అక్టోబర్ లో పాదయాత్ర చేస్తానంటూ వైసీపీ ప్లీనరీలో ఆర్భాటంగా చేసిన ప్రకటన నిజరూపం దాల్చే అవకాశం కనిపించడం లేదు. ఇంతకీ జగన్ పాదయాత్ర కి బ్రేక్ వేస్తోంది ఎవరో కాదు సాక్షాత్తు ఆయనే. ఆయన మీద వున్న కేసులే. జగన్ పాదయాత్ర కి సన్నాహకంగా ఇటీవల సిబిఐ కోర్ట్ లో ఓ పిటీషన్ దాఖలు చేసి ఎదురు దెబ్బ తిన్న విషయం తెలిసిందే. సిబిఐ వేసిన మూడు ఛార్జ్ షీట్ లకి సంబంధించి ఒకే విచారణ జరపాలని జగన్ ఆ పిటీషన్ లో కోరారు. అయితే మూడు నేరాలు, వాటి లబ్ది, ఉద్దేశాలు వేర్వేరు కాబట్టి ఆ కేసులు కలిపి విచారణ సాగించడం కష్టమని సిబిఐ కోర్టుకి తెలిపింది. దీంతో వేసిన పిటీషన్ ఉప సంహరించుకోడానికి జగన్ స్వయంగా ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో జగన్ పై దాఖలైన ఛార్జ్ షీట్ లకి సంబంధించి ఇక విచారణ వేర్వేరుగా జరుగుతుంది. వేగంగా జరుగుతుంది. ఆ ప్రక్రియలో జగన్ కి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే… ఆయన ఈ కేసుల విచారణకు రోజు మార్చి రోజు లేదా రెండు రోజులకి ఒక సారి కోర్టుకి హాజరు కావాలి. ఇలా కోర్టుకి హాజరు అవుతూ 3000 కిలో మీటర్ల పాదయాత్ర చేయడమంటే అయ్యే పని కాదు. ఆ విధంగా పాత కేసులు జగన్ ముందర కాళ్ళకి బంధాలుగా మారాయి. దీంతో జగన్ పాదయాత్రతో పార్టీ కొత్త ఉత్సాహం పుంజుకుంటుందని భావించిన వైసీపీ శ్రేణులు ఈ విషయం తెలిసి ఉసూరుమంటున్నాయి.
మరిన్ని వార్తలు