సమర శంఖం పూరించిన జగన్…!

YS Jagan Public Meeting In Tirupathi

ఈ సారి ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించి, అధికారం చెపట్టాలని ఫిక్సయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ప్రచారానికి సంసిద్ధమయ్యారు. సమరశంఖారావం పేరుతో అన్ని ఏపీ వ్యాప్తంగా జిల్లాల్లోనూ సభలను నిర్వహించనున్నారు. పార్టీకి చెందిన ప్రతినిధులతోనే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నా ఎన్నికల ప్రచారంగానే ఇవి కొనసాగనున్నాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ సమరశంఖారావం తిరుపతి నుంచే ప్రారంభం కానుంది. చిత్తూరు జిల్లా సమావేశం బుధవారం తిరుపతిలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సుమారు 40 వేల మంది హాజరవుతారని ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 2500 మంది చొప్పున బూత్‌ కమిటీల ప్రతినిధులు, కార్యకర్తలు సమావేశానికి హాజరకానున్నట్టు ఆయన పేర్కొన్నారు.

వీరందరినీ ఎన్నికలకు సన్నద్ధం చేయడం, పార్టీ హామీల గురించి చర్చించడం, ఎన్నికల ప్రక్రియలో కార్యకర్తలు, బూత్‌కమిటీల ప్రతినిధులు అమలు చేయాల్సిన వ్యూహాలను జగన్‌ వివరిస్తారు. ఫిబ్రవరి 7న కడప, ఫిబ్రవరి 11న అనంతపురం, ఫిబ్రవరి 13న ప్రకాశం జిల్లాల్లో జరిగే సభల్లో ఆయన పాల్గొననున్నారు. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ వైసీపీని మట్టి కరిపించింది అంటే దానికి కారణం ఆ పార్టీకి ఉన్న పోల్ మ్యానేజ్మెంట్ అనక తప్పదు. అందులో పీహెచ్డీ అందుకున్న బాబు, ఆ పనిని సమర్ధవంతంగా నిర్వహేన్చేలా చూసుకుని అధికారం పదిలం చేసుకున్నారు. ఈ విషయాన్నీ గర్హించిన జగన్ ఈసారి ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే తమ పార్టీ క్యాడర్ లో ఈ పోల్ మ్యన్జ్మేంట్ టెక్నిక్స్ నేర్పడమే పనిగా పెట్టుకుని ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు అని సమాచారం. నిజానికి ప్రతి జిల్లాలోను ఈ సభ ఒకటి కచ్చితంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తుకున్తున్న్నారు. మరి ఈ సారయినా జగన్ అధికారం అందుకుంటారేమో ? చూడాలి మరి ?