Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2014 ఎన్నికల ముందు రాజకీయ దిగ్గజాలు ఎందరికో వైసీపీ అధినేత టికెట్ ఇవ్వడానికి నో అన్నారు. అందుకే వారిలో చాలా మంది టీడీపీ పంచన చేరారు. అప్పట్లో వైసీపీ గెలుపు మీద జగన్ కి వున్న నమ్మకం అలాంటిది. ఇక ఇప్పుడు టికెట్ ఇస్తాం పోటీ చేయమంటున్నా రాజకీయ దిగ్గజాలు కాదు ఒక్క ఎన్నికలో కూడా గెలవని గొట్టిపాటి భరత్ లాంటి కుర్రోడు కూడా నాకొద్దు మొర్రో వైసీపీ టికెట్ అంటూ దూరంగా పరిగెత్తుతున్నారు. 2019 ఎన్నికల ముందు పరిస్థితులు ఇవి. ఈ ఐదేళ్ల కాలంలో రాజకీయంగా వైసీపీ ప్రయాణం ఎక్కడ నుంచి ఎక్కడికి సాగిందో చెప్పడానికే ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది ?
ప్రకాశం జిల్లా లో వైసీపీ టికెట్ నాకొద్దు అన్న నాయకులు ఇప్పటికి ఇద్దరు తేలారు. ముందుగా ఈ మాట దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద రెడ్డి అంటే అదే బాటలో నడిచాడు పర్చూరు నియోజక వర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గొట్టిపాటి భరత్. దీంతో షాక్ తిన్న జగన్ ఎలాగైనా ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా భరత్ తల్లి, చెల్లి ని తన పాదయాత్ర కొనసాగుతున్న చోటుకి పిలిపించుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పూడి బట్టబయలు అనే ఊరిలో భరత్ అమ్మగారు పద్మావతి, చెల్లి లక్ష్మి జగన్ తో సమావేశం అయ్యారు. ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి తాము ఆ స్థితిలో లేమని చెప్పారు. దానిపై జగన్ ఏ భరోసా ఇచ్చారో బయటకు తెలియదు గానీ టికెట్ తీసుకుని పోటీకి సిద్ధం కావాలని భరత్ ని ఒప్పించమని మాత్రం అడిగారు.
ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ ద్వారా భరత్ ని జగన్ బతిమాలారు. భరత్ కి మాత్రమే పర్చూరు టికెట్ ఇస్తామని జగన్ అన్నట్టు తెలియడంతో ఆ ఇద్దరినీ అభిమానించే వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. కానీ జగన్ బతిమాలాడని భరత్ పర్చూరు భారాన్ని మోయడానికి ఒప్పుకుంటారో, లేదో ఇంకా తెలియదు. అయితే భరత్ తప్పుకోవడం ఖాయమని భావించి ఆ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలెట్టిన ఇద్దరు మాత్రం ఈ వార్తలతో హర్ట్ అయ్యుంటారు. నిజానికి ఆ ఇద్దరు పేర్లు బయటకు చెప్పింది కూడా భరత్. ఆ విధంగా వారిలో ఆశలు, జగన్ లో భయం రేకెత్తించి టికెట్ కి టికెట్, ఆర్ధిక భరోసా కి ప్రామిస్ తీసుకుని భరత్ సరికొత్త రాజకీయ నాటకం ఆడాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.