Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద నాయకుల తోటే కటువుగా మాట్లాడతారని ప్రచారం జరుగుతోంది. సబ్బం హరి, రఘురామ కృష్ణంరాజు, మైసూరా రెడ్డి లాంటి వాళ్ళు ఆ తర్వాత టైం లో జగన్ వ్యవహారశైలిని బయటికి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జగన్ మొట్టమొదటిసారి ఓ బహిరంగంగా పాదాభివందనం చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. NDA తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాంనాథ్ కోవిద్ ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు పార్క్ హయత్ లో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వై.ఎస్ జగన్ తో పాటు ఆయన కి కుడి భుజం లాంటి విజయసాయి రెడ్డి కూడా కోవిద్ కి పాదాభివందనం చేశారు.
జగన్ వ్యవహారశైలి తెలిసిన వాళ్ళు ఈ పాదాభివందనం గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల చర్చ బయలుదేరినప్పటినుంచి బీజేపీ మనసు గెలవడానికి జగన్ చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కూడా అదే టార్గెట్ తో జగన్ ఈ పాదాభివందనానికి రెడీ అయినట్టున్నారు. చేసిన తప్పులు, తరుముకొస్తున్న కేసులు గుర్తుకు వస్తుంటే ఎంతటివారైనా తల వంచక తప్పదని జగన్ పాదాభివందనంతో ఇంకోసారి రుజువైంది.
మరిన్ని వార్తలు