సీఎం సీటే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. అది ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. ఈ పాదయాత్ర స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రయోజనం పొందడానికి వైసీపీ ప్లాన్లు రెడీ చేసింది. చివరి వారం రోజులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాధారణంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి త్యాగం, ధైర్యం లాంటివి చెప్పుకుంటే వోట్లు పడతాయేమో. కానీ ఈ వారం రోజుల ప్రోగ్రామ్‌లో పాదయాత్ర సంగతి పైపైన చెప్పి మిగతా మొత్తం చంద్రబాబు భజన చేయబోతున్నారు. అదేంటి అనుకుంటున్నారా ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ప్రతిపక్ష నేత పాదయాత్రలో గట్టిగా వినిపించారు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలని వైసీపీ యోచిస్తోంది. అందుకే ‘నిన్ను నమ్మం బాబు’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. ఈ వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాలన్నీ చంద్రబాబు పేరు చుట్టూ తిరగబోతున్నాయి.
“నిన్ను నమ్మం బాబూ…” అనే పెద్ద హోర్డింగ్‌ను తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఎత్తయిన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనీ, కనీసం 500 మంది గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిచి హాజరైన వారితో “నిన్ను నమ్మం బాబూ” కార్యక్రమానికి మద్దతుగా పార్టీ నెంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇప్పించాలనీ ఇలా అన్ని కార్యక్రమాలు చంద్రబాబుతోనే ముడి పడి పడేలా ప్లాన్ చేసింది. జగన్ గొప్పగా చెప్పుకునే నవరత్నాలు సహా ఇతర అంశాల ప్రస్తావన కూడా లేదు. ఇప్పటికే చాలా స్లోగన్స్ జగన్ కు మద్దతుగా వైసీపీ ప్రచారంలోకి తెచ్చింది. అందులో జగన్ రావాలి…జగన్ కావాలి, అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు లాంటివి ఉన్నాయి. అవన్నీ యావరేజ్‌గా మిగిలిపోయి సోషల్ మీడియా పోస్టులకు తప్ప దేనికి పనికి రాలేదు . అందుకే ఇప్పుడు వ్యూహం మార్చారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబుకు నెగెటివ్ ప్రచారం చేస్తే. అటోమేటిక్‌గా అది తమకు ప్రయోజనం కలుగుతుందనే భావనలో చంద్రబాబుకే ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది పిచ్చో వెర్రో మరి.?