Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వైసీపీకి ప్రధాన బలం రెడ్లే. జగన్ పార్టీ పెట్టినప్పట్నుంచీ వారిని కాపాడుకుంటూ వస్తున్నారు. జగన్ మతం క్రిస్టియన్ అయినా.. కులం మాత్రం రెడ్డే. అందుకే అటు క్రైస్తవులు, ఇటు రెడ్లు వైసీపీనే బలపరుస్తూ వచ్చారు. కానీ తొలిసారి నంద్యాలలో మాత్రం దెబ్బ గట్టిగానే తగిలిందని స్వయంగా జగనే సెలవిచ్చారు. ఏ కులం వాళ్లూ వైసీపీ వెంట నడవలేదు. దీనికి కారణాలు వెతికి ఆయింట్ మెంట్ రాసే పనిలో జగన్ మీడియా బిజీగా ఉంది. భూమా కుటుంబం కూడా రెడ్లే కాబట్టి.. ఉపఎన్నికల్లో వారిని ఓడించడం ఎందుకని రెడ్లంతా వారికి ఓటేశారట. ముందే జగన్ ను విమర్శించకూడదని కండిషన్ పెట్టారట. ఈమాట ఎవరైనా నమ్ముతారా అంటే.. నమ్మి తీరాలంటున్నాయి వైసీపీ వర్గాలు. కావాలంటే వచ్చే ఎన్నికల్లో చూసుకోండని తొడ కొడుతున్నాయి. మరి ఇంత తెలిసినప్పుడు శిల్పా మోహన్ రెడ్డి కూడా రెడ్డేగా.. ఆయన మాత్రం రెడ్లకు చేదా అంటే నోరు మెదపడం లేదు.
ఓటమిని హుందాగా అంగీకరించకుండా ఇంకా కుల రాజకీయాలు చేస్తున్న వైసీపీ.. వాస్తవాన్ని విస్మరించడం క్యాడర్ ను అయోమయంలోకి నెడుతోంది. 2012లో పార్టీ పెట్టిన జగన్.. ఇంతవరకూ క్యాడర్ ను పటిష్ఠం చేసుకోలేదు. పార్టీ యాక్టివిటీ రెగ్యులర్ గా జరగడం లేదు. ప్రతిరోజూ మానిటరింగ్ అసలే ఉండదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం కాకుండా చంద్రబాబు లాగా ఓ రెగ్యులర్ టైమ్ టేబుల్ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.
మరిన్ని వార్తలు: