Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
YSRCP stalls Andhra assembly over Roja’s suspension issue
ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజాకు టీడీపీ చుక్కలు చూపిస్తోంది. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబుపై నోరు పారేసుకున్న రోజా సభలో అడుగుపెట్టకూడదని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకే చంద్రబాబు వదిలేద్దామన్నా వారు మాత్రం పట్టు వీడటం లేదు. అవసరమైతే ఎంతవరకైనా రెడీ అంటున్నారట. దీంతో రోజా మల్లగుల్లాలు పడుతున్నారు. సీక్రెట్ గా బాబు కాళ్లు పట్టుకుందామన్నా.. బాల్ కోర్టులో ఉండటంతో ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే నగరిలో రోజాపై వ్యతిరేకత ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ముఖం చూడని ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుందో పరిస్థితి అందరికీ తెలుసు.
ఏపీ అసెంబ్లీ నుంచి రోజా బహిష్కరణపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. అయితే హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం చెప్పడంతో.. రోజా గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. స్పీకర్ కు సారీ లెటర్ ఇచ్చానని రోజా లాయర్ చెబితే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వ లాయర్ వాదించడంతో.. కోర్టులో సీన్ రసవత్తరంగా మారింది. దీంతో మరోసారి సారీ లెటర్ ను రోజా ద్వారా న్యాయస్థానం సమక్షంలో ప్రభుత్వానికి వచ్చింది. కానీ దీనికేం వంకలు పెడతారోనని రోజా గుబులుగా ఉంది.
దేనికైనా ఓ లిమిట్ ఉంటుందనే సంగతి మరిచిపోయినా.. ఒళ్లు తెలియకుండా రంకెలేయడంతో.. ఇప్పుడీ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వాన్ని విధానాల పరంగా విమర్శించాలే కానీ.. వ్యక్తిగతంగా కాదని రోజాకు ఎప్పుడు తెలిసొస్తుందో. ఇప్పటికే మాటతీరు మార్చుకోని రోజాకు కోర్టే బుద్ధి చెబుతుందంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీలో కూడా రోజాకు బలమైన వ్యతిరేక వర్గం తయారైంది. అటు జగన్ కూడా శీతకన్నేశారు. పరిస్థితి చూస్తుంటే రోజా రాజకీయాల నుంతి తెరమరుగు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని వార్తలు: