విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. పదో తరగతి ఫెయిల్ అయిన వారి కోసం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 1 నుంచి నిర్వహించనున్నట్లుగా మంత్రి సబిత ఈ సందర్భంగా ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారుఅంతేకాక, ప్రస్తుతం వచ్చిన మార్కులతో సంత్రుప్తి చెందకపోతే రీ వెరిఫికేషన్ కూడా విద్యార్థులు చేయించుకోవచ్చని వెల్లడించారు.
రీ వెరిఫికేషన్ ఆన్సర్ షీట్లను జిరాక్స్ తీసి పంపుతామని కూడా మంత్రి వెల్లడించారు. ఇందుకోసం నిర్దేశిత ఫీజు చెల్లించాలని చెప్పారు.పదో తరగతి పరీక్షలు రాసిన వారిలో అబ్బాయిలు 87 శాతం ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 92.45 శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. మొత్తం కలిపి 90 శాతం మంది పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. జిల్లాల వారీగా చూస్తే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో 97.87 శాతం ఉత్తీర్ణతతో తొలి స్థానంలో నిలిచింది.