Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లరి నరేష్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు ఉండేది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బడ్జెట్‌ను రాబట్టడంతో పాటు చిన్న చిత్రాల్లో పెద్ద విజయాలను సొంతం చేసుకునేవి. కాని గత రెండు మూడు సంవత్సరాలుగా అల్లరోడు పూర్తిగా డల్ అయ్యాడు. ఏ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద రాణించలేక పోతున్నాడు. అల్లరోడి కామెడీని తెలుగు ప్రేక్షకులు ఆధరించడం లేదు. దాంతో అల్లరోడి సినిమాల సంఖ్య చాలా తగ్గింది. అప్పట్లో సంవత్సరానికి అయిదు, ఆరు సినిమాలు చేసిన అల్లరోడు ఇప్పుడు ఒక్కటి రెండు కూడా విడుదల చేయలేక పోతున్నాడు.
తాజాగా అల్లరి నరేష్ నటించిన ‘మేడమీద అబ్బాయి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యి చాలా రోజులు అయ్యింది. కాని బయ్యర్లు దొరకకపోవడంతో పాటు, నిర్మాతలు విడుదల చేయాలంటే ఆందోళన చెందుతున్న కారణంగా సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఈ నెలలో సినిమా విడుదల ఉంటుందని ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. కాని తాజాగా సెప్టెంబర్‌కు ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. సెప్టెంబర్‌లో పెద్ద పెద్ద సినిమాలున్న నేపథ్యంలో ఈ చిత్రం విడుదల అప్పుడు కూడా కాలేదు. అంటే అక్టోబర్ వరకు ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుందేమో. సినిమా ఒకవేళ విడుదల అయినా కూడా పట్టించుకునే వారు లేరనే టాక్ వినిపిస్తుంది.
మరిన్ని వార్తలు: