Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Allari Naresh Serious On TV Reporter In Interview
అల్లరి నరేష్ సినిమాలు అంటే కొన్నాళ్ల క్రితం మినిమం గ్యారెంటీ చిత్రాలుగా పేరు ఉండేది. అల్లరి నరేష్‌తో సినిమా చేస్తే అది ఖచ్చితంగా నిర్మాతకు లాభాలను తెచ్చి పెట్టేది. కాని ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. గత నాలుగు సంవత్సరాలుగా అల్లరోడు ప్రేక్షకులను అలరించడం మర్చి పోయాడు. ప్రేక్షకులకు కూడా మెల్ల మెల్లగా అల్లరోడిని మర్చి పోతున్నారు. తాజాగా అల్లరి నరేష్ ‘మేడమీద అబ్బాయి’ అనే చిత్రాన్ని చేశాడు. ఆ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో అల్లరి నరేష్ ఇంట్రాక్ట్ అయ్యాడు.
ఆ సమయంలోనే ఒక రిపోర్టర్ అల్లరి నరేష్‌ను మీరు గతంలో మంచి చిత్రాలు ఇచ్చారు. ఇప్పుడు అలాంటి చిత్రాలు రావడం లేదు. కథల ఎంపిక విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవడం లేదనిపిస్తుంది. లేదంటే సినిమాలపై సీరియస్‌నెస్ లేకుండా చేస్తున్నారు అనే విమర్శలు వస్తున్నాయి, ఇందుకు మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించాడు. అందుకు అల్లరి నరేష్ కాస్త సీరియస్ అయ్యాడు. నాకు ఏ సినిమాలు చేయాలో, ఎలాంటి కథలు చేయాలో బాగా తెలుసు . మీ నుండి నాకు సలహా అవసరం లేదు అంటూ రిపోర్టర్‌కు కాస్త సీరియస్‌గానే చెప్పాడు. దాంతో ఆ రిపోర్టర్ సైలెంట్ అయ్యాడు.
మరిన్ని వార్తలు: