ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడూలాగానే ఈ ఏడూ కూడా ప్రైమ్ డే సేల్ జరపనుంది. నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు ఇది కొనసాగుతుంది. అంటే 36 గంటలపాటు ఈ ప్రైమ్‌డే సేల్ కొనసాగబోతుంది. ఈ ప్రైమ్‌డే సేల్ లో భాగంగా వినియోగదారులకు ఎన్నో ఆఫర్లు లభించబోతున్నాయి. మొత్తం 17 దేశాలలో అమెజాన్ ప్రైమ్‌డే సేల్ కొనసాగుతుంది. మనదేశంలో గత ఏడాది దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది రెండవసారి దీనిని కొనసాగించబోతున్నారు. సాధారణంగా లభించే అనేక వస్తువులతోపాటు అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో కొన్ని కొత్త వస్తువులను ప్రత్యేకంగా అందుబాటులోకి తెస్తారు. గత ఏడాది 34 కొత్త వస్తువులను ఈ సేల్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ ఏడాది 200 కొత్త వస్తువులు లభించబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారికి మాత్రమే అమెజాన్ ప్రైమ్‌డే సేల్‌లో వస్తువులు కొనే అవకాశం లభిస్తుంది. కాగా ప్రైమ్ డే సేల్‌ను దృష్టిలో ఉంచుకొని అమెజాన్ నెలకు 129తో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం ను ప్రారంభించింది. ఆ మెంబర్ షిప్ తీసుకున్నా ప్రస్తుతానికి సరిపోతుంది.
ఆఫర్లు ఏమిటంటే :
ఈ ప్రైమ్‌డే సేల్‌లో ప్రత్యేకంగా అమెజాన్‌కు చెందిన డివైజ్‌లపై పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. స్మార్ట్ఫోన్లపై బాగా ప్రసిద్ది చెందిన బ్రాండ్లపై 50 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
రెడ్ మీ వై2 సేల్ సోమవారం 1 గంటల నుంచి ప్రారంభిస్తుంది.
ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వారు క్విజ్‌లో పాల్గొని వన్ ప్లస్ 6 ఫోన్‌ను గెలుచుకునే అవకాశాలున్నాయి.
ఇతర డీల్స్ విషయానికివస్తే… స్యాంసంగ్ గేలాక్స్ నోట్ 8ను ఎక్సేంజీ చేసుకోవచ్చు.
మోటో జీ6పై కూడా ఎక్సేంచీ ఆఫర్ ఉంది.
హానర్ 7 ఎక్స్‌పై రూ.3,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది.
గెలాక్సీ నోట్ 8 ప్రస్తుతం భారత్‌లో రూ.55,900 వరకు లభిస్తోంది.
అమెజాన్ ఫ్రైమ్సేల్లో రూ.41,999కి అందు బాటులో ఉంచింది. ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా రూ.10వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. హెచ్డీఎఫ్సీ కస్టమర్ రూ.4,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో పాటు 9 నెలల పాటు ఈఎంఐలపై ఎలాంటి చార్జీలు వసూలు చేయమని చెబుతోంది.
ప్రత్యేకంగా అమెజాన్ ఎక్సిక్లూజివ్ స్మార్ట్ఫోన్లు కావాలనుకుంటే వాటిని ప్రైమ్‌డే కంటే ముందే ప్రైమ్ నౌ యాప్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. వాటిలో వన్ ఫ్లస్ 6, మోటో జీ6, రెడ్మీ 1ని అందుబాటులో ఉంచింది. ప్రైమ్ నౌ యాప్‌ద్వారా కొనుగోలు చేస్తే ప్రొడక్టుల డెలివరీ కేవలం రెండు గంటల్లోనే డెలివరీ ఇవ్వ డం జరుగుతుంది.
అదే ప్రైమ్ మెంబర్స్‌కి మాత్రం ఉదయం ఆరుగంటల నుంచి అర్ధరాత్రిలోగా కొన్ని ప్రొడక్టును డెలివ రీ చేస్తారు.