అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రూ.500 లకే లభించనుంది. కాని ఇది అందరికి కాదు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతి, యువకులకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. వయస్సును నిర్ధారించుకోవడానికి మీ పాన్ కార్డును అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను ప్రైమ్ డే 2019 జులై 15వ తేదీ, 16 తేదీలలో మాత్రమే అందిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఇండియా డైరెక్టర్ అక్షయ్ సిన్హా మాట్లాడుతూ… యువతను అమెజాన్ ప్రైమ్‌లో సభ్యులను చేర్చుకోవాలనే లక్ష్యంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంవత్సర చందా రూ.999తో సభ్యులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తమ వయస్సును నిర్ధారిస్తూ పాన్‌కార్డు అప్‌లోడ్ చేసిన 10 రోజుల అనంతరం అమెజాన్ పే బ్యాలన్స్‌లోకి రూ.500 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.