Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయనేతల్లో విలక్షణ శైలి ఉన్న నేత ఆనం వివేకానంద రెడ్డి. విలక్షణమైన వ్యక్తిత్వం, భోళా మనిషి అయిన ఆయన, ఎవరేం అనుకున్నా తాను ఉండాలనుకున్నట్టు ఉంటారు. ఎవరేం అనుకున్నా ఫర్లేదు… నాకు నచ్చినట్లే ఉంటానన్నట్లు ఉండే ఆయనపై ఎన్నో వార్తలు వచ్చాయి. ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇలా ఉంటారా ? ఇలా సిగరెట్లు తాగుతారా ? అంటూ సెటైరికల్ కధనాలు సైతం ప్రసారం అయ్యాయి ఆయన మీద. అయినా ఆయన ఇవేమీ పట్టించుకునే వారు కాదు అటువంటి మనిషి ఇప్పుడు అనారోగ్యంతో మంచం ఎక్కడం ఆయన అభిమానులని కలచి వేస్తోంది.
అయితే ఇప్పుడు ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనకీ గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఆనం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో సింగపూర్ వెళుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు.
వైద్యులను ఆనం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లువైద్యులు చెప్పారు. చంద్రబాబు వచ్చిన సమయంలో వివేకా కళ్లు తెరిచి చూశారని సమాచారం. ఆయన వెంట ఏపీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణలు కూడా ఆస్పత్రికి వచ్చారు. వివేకాను పరామర్శించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి దైర్యం చెప్పారు. ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.