Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
పట్టిసీమ స్పూర్తితో నదీజలాల సద్వినియోగం మీద సీఎం చంద్రబాబు ఫోకస్ పెంచారు. పై రాష్ట్రాల్లో కడుతున్న ప్రాజెక్టులతో భవిష్యత్ లో కృష్ణా జలాల మీద ఆధారపడే పరిస్థితి లేకపోవడం ఓ వైపు , గోదావరి జలాలు భారీగా సముద్రం పాలు కావడం ఇంకోవైపు … ఈ పరిస్థితిలోనదుల అనుసంధానంతో ఆంధ్రాలో సిరులు పండించవచ్చని పట్టిసీమ నిరూపించింది. ఇదే పద్ధతిలో మున్ముందు తక్కువ ఖర్చు , ఎక్కువ ఫలితం ఇచ్చే విధంగా జల ప్రణాళికలు వుండాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన ఆలోచనలకి అనుగుణంగా తాజాగా గోదావరి నీటిని పెన్నాకు తరలించే అద్భుత పధకానికి రూపకల్పన చేస్తున్నారు.
గోదావరి నీటిని పెన్నాకు తరలించే ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతిపాదనల్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయితే ప్రకాశం ,నెల్లూరు జిల్లాలతో పాటు నాలుగు రాయలసీమ జిల్లాలకు మేలు జరుగుతుంది. దాదాపు ఆరు జిల్లాల్లోని అన్ని పట్టణాలకు , గ్రామాలకు తాగు , సాగు నీరు అందుతుంది. చెరువులు , రిజర్వాయర్లు కూడా నింపుకోవచ్చు. గోదావరి నుంచి సముద్రం పాలవుతున్న 1500 టీఎంసీ లకు పైగా నీటిలో ఇదో వంతు నీటిని ఈ ప్రాజెక్ట్ ద్వారా సద్వినియోగం చేసుకోగలిగినా ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయానికి కాకుండా పరిశ్రమలకు కూడా నీటి సమస్య అన్న మాటే తలెత్తదు.