‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ డీటైల్స్‌…!

Aravinda Sametha First Weekend US Box Office Report

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అంతకు మించిన భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసింది. కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం ఏకంగా 92 కోట్లను నిర్మాత ఖాతాలో వేసినట్లుగా సమాచారం అందుతుంది. త్రివిక్రమ్‌ మరియు ఎన్టీఆర్‌ కాంబోకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఇంత భారీగా వసూళ్లు సాధించినట్లుగా సమాచారం అందుతుంది. అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం ఎన్టీఆర్‌ గత చిత్రాలను బీట్‌ చేసి బిజినెస్‌ చేసింది. 92 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయిన నేపథ్యంలో 100 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది. అలా రాబట్టితేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవుతారు. మరి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్‌ 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

aravindha-sametha

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ :
నైజాం : 19 కోట్లు
సీడెడ్‌ : 15 కోట్లు
వైజాగ్‌ : 9.2 కోట్లు
ఈస్ట్‌ : 6 కోట్లు
వెస్ట్‌ : 4.8 కోట్లు
గుంటూరు : 7.2 కోట్లు
కృష్ణ : 5.5 కోట్లు
నెల్లూరు :3.3 కోట్లు
కర్ణాటక : 8.2 కోట్లు
ఓవర్సీస్‌ : 12.5 కోట్లు
ఇతరం : 1.3 కోట్లు
మొత్తం : 92 కోట్లు

ntr