Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత వారం విడుదలైన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్ చిత్రంగా నిలిచిపోయింది. రామ్ గోపాల్ వర్మ అయితే తాను తెరకెక్కించిన ‘శివ’ సినిమా కంటే అర్జున్ రెడ్డి అదుర్స్ అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు చాలు అర్జున్ రెడ్డి ఎలా ఉందో చెప్పడానికి. అంత సక్సెస్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సందీప్ రెడ్డి తర్వాత సినిమా ఏంటా అని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డికి పలువురు యువ హీరోల నుండి శుభాకాంక్షలు తెలుపుతూ కాల్స్ వచ్చాయి. వారు సందీప్‌తో వర్క్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు.
ఇటీవల శర్వానంద్ లేదా అల్లు అర్జున్‌తో సందీప్ రెడ్డి సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సమయంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి తన తర్వాత సినిమాపై చిన్న క్లూ వదిలాడు. తాను తర్వాత చేయబోతున్న సినిమా ప్రేమ కథ కాదని, పొలిటికల్ డ్రామా అంటూ చెప్పుకొచ్చాడు. ప్రేమ కథతో సూపర్ హిట్ కొట్టిన సందీప్ మళ్లీ ప్రేమ కథను ఎంచుకోకుండా ఇలా తిక్క నిర్ణయం తీసుకోవడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం యువత ప్రేమ కథలను ఎక్కువగా ఆధరిస్తున్నారని, పొలిటికల్ డ్రామా అంటే ప్రయోగాత్మక చిత్రమే అవుతుందని, ఈ సమయంలో ప్రయోగాలు అవసరమా అంటూ సందీప్‌ను ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని వార్తలు: