Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమా చూసే ప్రేక్షకుల్లో సహనం తక్కువగా ఉంటోంది. అందుకే మూడు గంటల పాటు సినిమా తీసే సాహసం ప్రజెంట్ డైరెక్టర్లు పెద్దగా చేయటం లేదు. చిన్న సినిమా డైరెక్టర్లయితే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ తన సినిమాకు ఎంచుకున్న కథలానే అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమా నిడివి విషయంలో కూడా భారీ సాహసమే చేశారు. అర్జున్ రెడ్డిని మూడు గంటల సినిమాగా రూపొందించారు. విడుదలకు ముందు ఈ సినిమా మూడుగంటలు ఉంటుందంటే…అంతా ఆశ్చర్యపోయారు. అంత పెద్ద సినిమాను ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఎక్కువ నిడివి ఉన్నా అర్జున్ రెడ్డిని ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వలేదు. మొత్తం సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంటున్న అర్జున్‌రెడ్డి సినిమా నిడివి విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేసింది.
చిత్రానికి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో అర్జున్ రెడ్డి దర్శకనిర్మాతలు ఈ సినిమా నిడివిని మరింతగా పెంచాలనుకుంటున్నారు. కొన్ని పరిమితుల వల్ల, మల్లీప్లెక్సుల్లో సౌకర్యవంతంగా ఉండాలన్న ఉద్దేశంతో సినిమా నిడివి తగ్గించామని వారు చెబుతున్నారు.ఇంకా తమ దగ్గర 40 నిమిషాల ఫుటేజి ఉందని, దానిని కూడా సినిమాకు కలపాలనుకుంటున్నామని ఇప్పటికే హీరో విజయ్ దేవరకొండ ప్రకటించారు. కథకు ఈ ఫుటేజ్ కూడా చాలా అవసరమని, ఆడియెన్స్ కొత్త సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తారని విజయ్ అన్నారు. 40 నిమిషాల ఫుటేజ్ కూడా యాడ్ చేస్తే అర్జున్ రెడ్డి నిడివి మొత్తం మూడు గంటలా 40 నిమిషాలు ఉంటుంది. ఇదో రికార్డు అని చెప్పవచ్చు.
మరిన్ని వార్తలు: