తెలుగు వారి ఆరాధ్యదైవం సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. బయోపిక్‌ను ఏకంగా 30 కోట్లతో నిర్మించడంతో అంతా కూడా షాక్ అయ్యారు. సావిత్రి సినిమాకు అంత ఖర్చు చెందుకు పెడుతున్నారో అంటూ అంతా కూడా అనుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో ప్రస్థావించడం జరిగింది.
‘మహానటి’ చిత్రానిన మొదట 16 కోట్లు అనుకున్నాం. సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ పూర్తి అయిన సమయంలో 16 కోట్లతో సినిమా పూర్తి చేస్తామని నాగ్ చెప్పినప్పుడు కాస్త ఎక్కువ బడ్జెట్ అనుకున్నా. అయితే సావిత్రమ్మ సినిమా కనుక ఎక్కువ పెటొచ్చు అనుకున్నా. కాని సినిమా అంతా పూర్తి అయ్యేప్పటికి 30 కోట్లకు బడ్జెట్ చేరింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా తీయాలనే ఉద్దేశ్యంతో అంత బడ్జెట్‌తో తీయడం జరిగింది. ఆ కారణంగానే మహానటి చిత్రం అంత బాగా వచ్చిందని అశ్వినీదత్ చెప్పుకొచ్చాడు. అయితే సినిమా నిర్మాణంకు ఎక్కువ ఖర్చు చేసిన కారణంగా లాభం కాస్త తగ్గిందని, 20 నుండి 25 కోట్లతో నిర్మించి ఉంటే మరింతగా లాభాలు వచ్చేవని నిర్మాత అంటున్నారు. ఇక మహానటి చిత్రంకు భారీ బడ్జెట్ పెట్టడం తప్పు అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు.