Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాని హీరోగా సూపర్ సక్సెస్‌ను దక్కించుకుంటున్న సమయంలో నిర్మాతగా మారి వాల్ పోస్టర్ బ్యానర్‌ను ప్రారంభించి నిర్మించిన చిత్రం ‘అ!’. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘అ!’ చిత్రంకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందించడం జరిగింది. మాస్ ఏరియాల్లో కాస్త షేర్‌ను రాబడుతున్న ఈ చిత్రం క్లాస్ ఏరియాల్లో మంచి వసూళ్లను సాధిస్తుంది. ఇక ఈ చిత్రం ఓవర్సీస్లో కూడా మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. ఖచ్చితంగా మిలియన్ మార్క్ దాటుతుందని అంతా భావించారు. కాని షాకింగ్‌గా ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.
మొదటి మూడు రోజులు పర్వాలేదు అన్నట్లుగా వచ్చిన కలెక్షన్స్ ఆ తర్వాత డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఓవర్సీస్లో చిత్ర కలెక్షన్స్‌పై పైరసి ప్రభావం తీవ్రంగా ఉంది. విడుదలైన రెండవ రోజే ఆన్లైన్లో ‘అ!’ చిత్రం పైరసీ ప్రింట్ రావడంతో ఓవర్సీస్ ప్రేక్షకులు అంతా పైరసీ వైపు మొగ్గు చూపినట్లుగా విశ్లేషకులు అంటున్నారు. పైరసీ వల్ల నాని చిత్రానికి ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లు తగ్గినట్లే అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పైరసీ వల్ల సక్సెస్ అయిన నాని సినిమాకు కూడా దారుణమైన కలెక్షన్స్ ఓవర్సీస్లో తప్పలేదు. ‘అ!’ చిత్రం ఓవర్సీస్ టికెట్ రెటు కూడా ఎక్కువగా ఉండటం వల్ల కూడా ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించినట్లుగా కొందరు చెబుతున్నారు.