Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్తే అది అక్షరాలా పాటించడానికి వైసీపీ అధినేత జగన్ రెడీ అయిపోయారు. అందుకే పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రశాంత్ మాట వినే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో దిగ్గజాలు అనుకున్న బొత్స, ధర్మాన లాంటి వారి ప్రాధాన్యం తగ్గించడానికి కూడా రెడీ అయిపోయారు జగన్. ఈ ఇద్దరే కాదు దాదాపు 40 మంది మంది వైసీపీ ఇన్ఛార్జ్ ల పనితీరు మీద ప్రశాంత్ టీం సర్వే లో అసంతృప్తి ఉన్నట్టు తేలిందట. ఈ ఇన్ ఛార్జ్ లకి క్లాస్ పీకడానికి జగన్ రెడీగా ఉన్నారట. వీరిలో కొందరికి ఊస్టింగ్ చెప్పే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే ఇలా ప్రశాంత్ తయారు చేసిన నివేదిక జగన్ చుట్టాల్లో కుంపటి రగిల్చింది. బావాబావమరుదుల మధ్య అంతంత మాత్రంగా వున్న సంబంధాల్ని ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టింది.
ప్రశాంత్ కిషోర్ తయారు చేసిన నివేదికలో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక ఆ నియోజకవర్గంలో ప్రజాభిమానం పొందడానికి బాలినేని చెప్పుకోదగ్గ ప్రయత్నాలు చేయడం లేదని ప్రశాంత్ టీం తేల్చిందట. కానీ అక్కడే అసలు విషయం దాగి వుంది. కిందటి ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కి బాబాయ్, తనకి బావ అయిన సుబ్బారెడ్డి తో బాలినేని సంబంధాలు బాగా దెబ్బ తిన్నాయి. దీంతో ఆయన అలిగి కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా వున్నారు. ఓ దశలో ఆయన టీడీపీ లో చేరుతారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే జగన్, విజయమ్మ నచ్చచెప్పడంతో బాలినేని వెనక్కి తగ్గారు. తిరిగి పార్టీ కార్యక్రమాల్లో కొంత కాలం నుంచి చురుగ్గా పాల్గొంటున్నారు. ఇటీవల నిర్వహించిన ప్లీనరీకి కూడా మంచి స్పందనే కనిపించింది. అయితే ఇంతలో తన పనితీరు బాగాలేదని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారన్న వార్తతో బాలినేని హర్ట్ అయ్యారట. ఇదంతా బావ సుబ్బారెడ్డి పని అని కూడా బాలినేని అనుమానిస్తున్నారట. ఈ సందేహాలు తీరకపోతే మరోసారి బావాబావమరుదుల మధ్య గొడవ ఇంకెంత దూరం వెళుతుందో?
మరిన్ని వార్తలు