తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 విజేత అయిన కౌశల్ తాజాగా తన అభిమానులతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా నన్ను గెలిపించినందుకు మీ అందరికి కృతజ్ఞతలు అంటూ కౌశల్ ఎమోషన్ అయ్యాడు. మీరు నన్ను గెలిపించినందుకు మీ రుణం తీర్చుకుంటాను అన్నాడు. నేను బిగ్ బాస్‌లోకి వెళ్లింది డబ్బును గెలుచుకోవడానికి కాదు, మిమ్ములను గెల్చుకోవడానికి, ఈ అభిమానాన్ని గెల్చుకోవడానికి అంటూ కౌశల్ చెప్పుకొచ్చాడు.
ఇంతటి అభిమానం చూపుతున్న మీకోసం నేను ఏమైనా చెస్తాను, చెప్పండి నేను ఏం చేయాలి, మీకోసం నేను ఏం చేస్తే మీరు సంతోషిస్తారు అంటూ కౌశల్ అభిమానులను ప్రశ్నించాడు. దాంతో అంతా కూడా కౌశల్ సినిమాల్లోకి రావాలి అంటూ గట్టిగా మొత్తుకున్నారు. హీరోగా సినిమాల్లో నటించాలంటూ కౌశల్ అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు సమాధానంగా కౌశల్ తప్పకుండా మీ కోరికను తీర్చుతాను. మీ అందరి కోసం తప్పకుండా సినిమాలో నటిస్తాను. ఏ దర్శకుడైనా మంచి సినిమాతో, మంచి పాత్రతో వస్తే తప్పకుండా మీ అందరి కోసం సినిమాను చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు బుల్లి తెరపై పలు సీరియల్స్‌లో నటించి, వెండి తెరపై చిన్న చిన్న గెస్ట్ పాత్రలను పోషించిన కౌశల్ ఇప్పుడు హీరో అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.