ఎలుకలే వరదలకు కారణమా..?

bihar-water-resource-minister-comedys-statement-on-floods

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

బీహార్లో వరదల కారణంగా ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎధుర్కుంటోంది. దీంతో ఎలుకలపైకి నెపం నెట్టేశారు. సాక్షాత్తు జలవనరుల శాఖ మంత్రి లలన్ సింగ్ ఈ మాట చెప్పడం పెద్ద కామెడీ అయిపోయింది. కమలా బాలన్ నది గట్టున రైతులు ధాన్యం నిల్వ చేశారన, అక్కడ ఉన్న ఎలుకలే గట్టుకు కన్నాలు పెట్టి.. వరదలు అదుపుతప్పేలా చేశాయన్నది లలన్ సింగ్ సూత్రం.

నాయకులు ఇంత వింతగా మాట్లాడటం చూసి.. జనం ముక్కున వేలేసుకుంటున్నారు. సాక్షాత్తు నీతివంతుడైన సీఎం నితీష్ పాలనలో ఇలాంటి పనులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. సుపరిపాలన అందిస్తున్నానని చెప్పుకుంటున్న నితీష్ కు ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. వరదలు కంట్రోల్ చేయలేకపోయామని బాథపడితే పోయేదానికి.. ఎలుకల కారణంగానే వరదలు వచ్చాయని చెప్పడాన్ని సమర్థించుకోవడం చాలా కష్టమైపోతోంది.

ఇటు బీజేపీ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకుంది. అధికార కూటమిలో భాగస్వామి అయినా బీజేపీ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని డ్యాములు పటిష్టంగా ఉన్నాయని అసెంబ్లీలో చెప్పి ఇప్పుడు ఎలుకలపైకి నెపం నెడతారేంటని ఆయన నిలదీశారు. అటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. ప్రతి దానికీ ఎలుకలపై నెపం నెట్టేయడం ఫ్యాషనైపోయిందని విమర్శిస్తున్నాయి.

మరిన్ని వార్తలు:

సింగ‌పూర్ అధ్య‌క్షుడిగా భార‌త సంత‌తి వ్య‌క్తి…

బ‌త‌కాలని లేదంటున్న గుర్మీత్

ఆదివారం ఉదయం కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ