టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ

BJP Party Started targeting TRS party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొంతకాలంగా టీఆర్ఎస్ తో ఎలా నడుచుకోవాలో తెలియక అధిష్ఠానం ఆజ్ఞ కోసం ఎధురుచూసిన తెలంగాణ నేతలు.. ఇప్పుడు మాత్రం ధైర్యం చేసి గోదాలోకి దిగారు. విమోచన దినం అధికారికంగా జరపాలనే డిమాండ్ తో బస్సుయాత్ర చేస్తున్నారు. కానీ నేతల బస్సుయాత్ర పూర్తవ్వకముందే.. మోడీ వారికి షాకిచ్చారు. దత్తాత్రేయను కేంద్రమంత్రిగా తొలగించారు.

మోడీ తీసుకున్న నిర్ణయం టీఆర్ఎస్ కు హుషారు తెప్పించింది. మోడీకి తెలంగాణ నేతలపై నమ్మకం లేకే.. దత్తన్న పదవి పీకేశారని, ఇప్పటికైనా కమలనాథులు వాస్తవాలు గ్రహించాలని గులాబీ బ్యాచ్ సెటైర్లు వేస్తోంది. మరోవైపు ఎంఐఎం అధినేతలు ఒవైసీల్ని బీజేపీ విమర్శిస్తుంటే.. టీఆర్ఎస్ వెనుకేసుకురావడం కూడా విడ్డూరంగా ఉంది.

ఉద్యమ సమయంలో విమోచన దినం అధికారికంగా నిర్వహిస్తామన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే అప్పట్లో విమోచన దినం గురించి మాట్లాడని బీజేపీ.. ఇప్పుడెందుకు మాట్లాడుతోందని టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. మొత్తం మీద మోడీ, కేసీఆర్ బంధం బాగున్నా.. టీఆర్ఎస్, బీజేపీ బంధం మాత్రం ఏం బాగోలేదు. పైగా వీరి గొడవకు పరోక్షంగా ఒవైసీలు కారణం కావడం ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు:

లోకేష్ కి సైకాలజిస్ట్ అవసరం… జగన్ ఎప్పుడు నేర్చుకుంటాడో ?

ఎవరో రావాలి, ఏదో చేయాలి… జగన్ ఎదురుచూపులు.