Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నితిన్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ‘ఛల్ మోహన్ రంగ’ టీజర్‌ను నేడు పవన్ కళ్యాణ్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రిప్ట్ సహకారం అందించడంతో పాటు పవన్ కళ్యాణ్ నిర్మిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు అనుగుణంగా దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పవన్ సమర్పణలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. క్యూట్ లవ్ స్టోరీతో కొత్త స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెకెక్కిస్తున్నాడని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.
వానకాలంలో పరిచయం, చలికాలంలో ప్రేమ, వేసవి కాలంలో విడిపోయాం అంటూ నితిన్ చెప్పిన డైలాగ్ కథపై ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం సోషియో ఫాంటసీ సినిమా అయ్యి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టీజర్లో మాత్రం ఆవిషయంపై ఎలాంటి క్లారిటీ రాలేదు. సినిమా ట్రైలర్లో ఏమైనా ఆ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందో చూడాలి. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
త్వరలో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు. సమ్మర్లో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. నితిన్ 25వ చిత్రం అవ్వడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. పవన్, త్రివిక్రమ్‌ల బ్రాండ్ ఇమేజ్ ఈ చిత్రంకు తప్పకుండా ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మేఘా ఆకాష్‌తో మరోసారి ఈ చిత్రంలో నితిన్ జత కట్టాడు.